జుకర్‌బర్గ్‌కు భారీ షాకిచ్చిన పుతిన్: రష్యా ఉగ్రవాద జాబితాలోకి ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా
మాస్కో: రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాను ఉగ్రవాద, తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చి భారీ షాకిచ్చింది. ఉక్రెయిన్ దేశానికి అమెరికా మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఫెడరల్ సర్వీస్ ఫర్ ఫైనాన్షియల్ మానిటరింగ్ (రోస్ఫిన్‌మోనిటరింగ్) డేటాబేస్ ప్రకారం.. రష్యా తన "ఉగ్రవాద, తీవ్రవాద" సంస్థల జాబితాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటాను చేర్చింది.

ఈ ఏడాది ప్రారంభంలోనే రష్యా కోర్టు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను దేశంలో నిషేధించింది. వీటి మాతృ సంస్థ మెటాను ఉగ్రవాదిగా పేర్కొంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలపై క్రెమ్లిన్ అణిచివేత ప్రారంభమైంది.
జుకర్‌బర్గ్‌కు చెందిన సోషల్ మీడియా ఫాట్‌ఫాం తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిందని మాస్కో కోర్టు ఆరోపించింది. ఉక్రెయిన్ లోని సోషల్ మీడియా యూజర్లు రష్యన్లపై హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్టు చేయడానికి అనుమతిస్తోందని మండిపడింది.
కాగా, ఒక నెల తర్వాత, ఏప్రిల్‌లో, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను రష్యా విదేశాంగ శాఖ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. జుకర్‌బర్గ్, పలువురు ఉన్నత స్థాయి వ్యక్తులతో పాటు రష్యా ఫోబిక్ ఎజెండాను ప్రచారం చేశారని ఆరోపించారు.
ఇప్పుడు రష్యా తన ఉగ్రవాద సంస్థ జాబితాలో మెటాను చేర్చడం సంచలనంగా మారింది.
ఉక్రెయిన్‌పై రష్యా తన సైనిక దాడులను తీవ్రతరం చేసిన తర్వాత ఈ చర్యను అనుసరించింది . సోమవారం, మాస్కో అనేక ఉక్రేనియన్ నగరాలపై బాంబు దాడి చేసింది. దీంతో అనేక మంది పౌరులు మరణించారు. ఓ భారీ వంతెనతోపాటు పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications