ఫేస్‌బుక్‌ను తాకిన సెగ:జుకర్‌బర్గ్‌పై ఉద్యోగుల తిరుగుబాటు: మార్క్..ఉక్కిరిబిక్కిరి: ట్రంప్ పై
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఘర్షణల సెగ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు తాకింది. ఫేస్‌బుక్ ఉద్యోగులు కొందరు తమ సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్‌పై ఏకంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కారణమైంది. అనూహ్యంగా చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలతో జుకర్‌బర్క్ ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మిన్నంటిన నిరసనలు..
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో పెద్ద ఎత్తున జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మూడు రోజుల కిందట మిన్నేపొలీస్‌లో ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలు ప్రస్తుతం అమెరికా మొత్తానికీ వ్యాపించాయి. రాజధాని వాషింగ్టన్ వరకూ పాకాయి. నిరసన కారుల ప్రదర్శనల వల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించాయి.
ఫేస్‌బుక్‌ను తాకిన నిరసనలు..
తాజాగా- ఈ నిరసన ప్రదర్శనల సెగ ఫేస్‌బుక్‌లో సెగలు రేపింది. కాలిఫోర్నియా మెన్‌లో పార్క్‌లో గల ఫేస్‌బుక్ కార్యాలయంలో పని చేస్తోన్న కొందరు ఉద్యోగులు మార్క్ జుకర్‌బర్గ్‌పై తిరుగుబాటు లేవనెత్తారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించడానికి ఫేస్‌బుక్ యాజమాన్యం ఎలాంటి చర్యలను తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మార్క్ జుకర్‌బర్గ్‌ను నిలదీస్తున్నారు కూడా.

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించాలంటూ..
జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళలనలను చేపట్టిన నల్లజాతీయులకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలను నియంత్రించాలనేది ఫేస్‌బుక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ప్రదర్శనకారులను రెచ్చగొట్టేలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలను ఫేస్‌బుక్ ద్వారా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తితే.. అది మరిన్ని దాడులకు ప్రేరేపించడానికి కారణమౌతుందని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ డిజైన్ డైరెక్టర్ డేవిడ్ గిల్లీస్ అన్నారు.

ప్రతి ఉద్యోగీ ఇదే కోరుకుంటున్నాడంటూ..
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై ట్విట్టర్ తీసుకున్న చర్యలను చేపట్టాలని తాను మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగి కూడా కోరుకుంటున్నారని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జేసన్ టఫ్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని, ట్రంప్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించకపోతే అవి మరింతపెచ్చరిల్లుతాయనీ జేసన్ అభిప్రాయపడ్డారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications