ట్రంప్ పక్కనే ఉండే ఈ పాతికేళ్ల భామ ఎవరో తెలుసా..?.. 60 ఏళ్ల టైకూన్ తో ప్రేమాయణం

కరోలిన్ లీవిట్.. వయసు 27 ఏళ్లు. ఇప్పుడు అమెరికాలో అత్యంత పాపులర్ వ్యక్తుల్లో ఒకరిగా మారారు. అతి పిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో ప్రెస్ సెక్రటరీ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ర్యాపిడ్ ఫైర్ కమ్యూనికేషన్, రిప్లైస్ కు అమెరికా ప్రజలు మాత్రమే కాదు యావత్ ప్రపంచం కూడా ఫిదా అవుతోంది. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు అధ్యక్ష ఎన్నికల ముందే కీలక పదవి ఇస్తానని మాటిచ్చాడు.

అందుకు అనుగుణంగానే అధ్యక్ష పదవి చేపట్టాక ఆమెను వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ జనరల్ గా నియమించారు. దీంతో అమెరికా చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ హోదా దక్కిన వ్యక్తిగా కరోలిన్ నిలిచారు. వైట్ హౌజ్ నుంచి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు రిపోర్టర్స్ కు చేరవేస్తూ.. వైరల్ రిప్లైస్ తో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు కరోలిన్.

ట్రంప్ వెన్నంటే..

2024లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ బిజీగా ఉన్నప్పుడు.. ట్రంప్ ఏం మాట్లాడాలో కరోలిన్ సూచనలు ఇచ్చేదట. ఆ సమయంలో కరోలిన్ నేషనల్ ప్రెస్ సెక్రటరీగా ఉన్నారు. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సమయంలో ఆమె అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ట్రంప్.. కరోలిన్ ను తెగ పొగిడేవారట. ఆమె స్మార్ట్, టఫ్, అత్యంత ప్రతిభావంతమైన మాటకారి అని ప్రశంసించేవారు.

Fascinating Facts About Karoline Leavitt the White House Press Secretary General

కరోలిన్ ప్రస్థానం..

కరోలిన్ లీవిట్.. న్యూ హాంప్ షైర్ లోని అట్కిన్సన్ నగరంలో జన్మించారు. కరోలిన్ పేరెంట్స్ ఓ ఐస్ క్రీమ్ షాపు నడిపేవారు. మసాచుశెట్స్ లోని సెంట్రల్ క్యాథోలిక్ హై స్కూల్ లో విద్యాభ్యాసం పుర్తయింది. ఆ తర్వాత ఆమె మీడియా రంగంలో అడుగుపెట్టారు.

60 ఏళ్ల టైకూన్ తో ప్రేమాయణం..

కరోలిన్ 60 ఏళ్ల బిజినెస్ టైకూన్ నికోలాస్ రాబర్ట్ తో ప్రేమాయణం నడిపారు. అనంతరం 2023లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+