సుత్తులు, కత్తులే ఈ కిరాతకుడి ఆయుధాలు అమెరికాలో భారీ దాడికి ప్లాన్: చివరి నిమిషంలో..!!
అమెరికాలో నూతన సంవత్సర వేడుకలకు ముందు భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం అయింది. ఈ కుట్రకు పాల్పడిన నార్త్ కరోలినాలోని మింట్ హిల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల క్రిస్టియన్ స్టార్డివెంట్‌ను ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. ఐసిస్ (ISIS) ఉగ్రవాద సంస్థ స్ఫూర్తితో నూతన సంవత్సర వేళ ప్రాణాంతక దాడికి అతను ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఐసిస్ తాజాగా వెల్లడించింది.
సోషల్ మీడియా ద్వారా ఐసిస్ సిద్ధాంతాలకు క్రిస్టియన్ ప్రభావితం అయ్యాడు. తనను తాను ఆ సంస్థ సైనికుడిగా ప్రకటించుకున్నాడు. 2025 డిసెంబర్‌లో ఇతడు ముస్లిమేతర సముదాయాలపై ద్వేషపూరిత పదజాలాన్ని ఉపయోగించి అనేక ఆన్‌లైన్ పోస్ట్‌లను షేర్ చేశాడు. క్రిస్టియన్ తన జిహాద్ దాడి ప్రణాళికలో భాగంగా జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ఇష్టానుసారంగా సుత్తులు, కత్తులతో దాడి చేయాలని ప్లాన్ చేశాడు.

నార్త్ కరోలినాలోని ఓ గ్రోసరీ షాప్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌ను లక్ష్యంగా చేసుకోవాలని అతను భావించినట్లు ఎఫ్‌బీఐ దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైంది. దాడికి అవసరమైన ఆయుధాలతో పాటు తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి అవసరమైన దుస్తులు, మాస్కులు, గ్లోవ్స్ సైతం సిద్ధం చేసుకున్నాడు. వాటన్నింటినీ కూడా ఎఫ్బీఐ అధికారులు అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 29న అతని ఇంటిపై జరిపిన సోదాల్లో న్యూ ఇయర్ అటాక్ 2026 అనే నోట్‌బుక్ లభ్యమైంది.
అందులో 20 మందికి పైగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే ప్రణాళిక వివరంగా ఉంది. దాడి తర్వాత ఐసిస్ కోసం తనను తాను అమరవీరుడిగా నిరూపించుకోవడానికి పోలీసులపై దాడి చేయాలని అతను ఆ నోట్‌బుక్‌లో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులు కొందరు ఆయుధాలను దాచినప్పటికీ, అతని గది నుండి సుత్తులు, కత్తులు, లక్ష్యాల జాబితా, వ్యూహాత్మక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దోషిగా తేలితే నిందితుడికి 20 సంవత్సరాల వరకు ఫెడరల్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications