America: జాతి వివక్ష చూపిస్తారా.. రూ.210 కోట్లు చెల్లించాలని ఆదేశం..
జాతి వివక్షపై అమెరికాలోని ఫెడరల్ జ్యూరీ సంచలన తీర్పు చెప్పింది. శ్వేతజాతీయరాలి అనే కారణంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఓ ఉద్యోగిని వేసిన పిటిషన్ లో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్ బక్స్ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. సదరు ఉద్యోగినికి రూ.210 కోట్లు(25.6 మిలియన్లు) పరిహారం చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ స్పష్టం చేసింది. షానన్ ఫెడరల్ పౌర హక్కులు. జాతి వివక్షను నిషేధించే న్యూజెర్సీ చట్టాలను స్టార్‌బక్స్ ఉల్లంఘించిందని తీర్పు చెప్పింది.
షానన్ అనే మహిళ దాదాపు 13 సంవత్సరాలు స్టార్‌బక్స్‌లో ఉద్యోగిగా ఉన్నారు. ఆమె రిటెన్‌హౌస్ స్క్వేర్‌లోని స్టార్‌బక్స్ ఫిలడెల్ఫియా స్టోర్‌లో పని చేస్తుండగా ఓ ఘటన జరిగింది. 2018లో స్టార్ బక్స్ కాఫీ షాప్ కు ఇద్దరు నల్లజాతీయులు రాషోన్ నెల్సన్, డోంటే రాబిన్సన్ వచ్చారు. అందులో ఒకరు షాప్ వాష్ రూమ్ వాడుకోవాలని వారి అడిగారు. అయితే వారు షాప్ లో ఏం కొనుగోలు చేయకపోవడంతో సిబ్బంది.. వాష్ రూమ్ వాడుకునందేకు నిరాకరించారు.

తాము తమ వ్యాపార సహచరుడిని కలవడానికి వేచి ఉన్నామని చెప్పారు. అయితే దుకాణంలోని సిబ్బంది నెల్సన్, రాబిన్సన్ షాప్ నుంచి బయటకు వెళ్లాలని కోరారు. అందుకు వారు నిరాకరించారు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగంది. ఆ తర్వాత స్టార్ బక్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వారికి బేడీలు వేసి తీసుకెళ్లారు. వారి అరెస్ట్ కు సంబంధించి వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కంపెనీ తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి.
దీంతో కంపెనీ ఆ షాప్ రిజినల్ మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగించింది. కానీ మేనేజర్ మాత్రం విధుల్లోనే ఉంచింది. అయితే రిజినల్ మేనేజర్ శ్వేత జాతియురాలు కాగా.. మేనేజర్ నల్లజాతీయుడు. తనపై జాతీ వివక్ష చూపారని 2019లో రిజినల్ మేనజర్ ఫెడరల్ జ్యూరీని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జ్యూరీ స్టార్ బక్స్ ఉద్యోగిని హక్కులను కంపెనీ కాలరాసిందని.. పేర్కొన్న జ్యూరీ ఆమెకు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications