Google Search: రికార్డు బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్..
భారత్ లో అత్యంత ఆదరణ ఉన్న గేమ్ ఏదంటే.. క్రికెట్ అని ఇట్టే చెప్పేస్తారు... కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ ఉన్న గేమ్ మరొకటి ఉంది. అదే సాకర్(ఫుడ్ బాల్). ఈ ఫుట్ బాల్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లది మంది అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులకు గత నెల రోజులు పండుగలా సాగింది. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ ఆదివారం వరకు కొనసాగింది. అయితే గూగుల్ సెర్చ్ లో ఫిఫా వరల్డ్ కప్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట.

అత్యధిక ట్రాఫిక్
FIFA వరల్డ్ కప్ ఫైనల్.. గూగుల్ సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసిందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై 4-2 పెనాల్టీ షూటౌట్‌తో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ ను గెలుచుకుంది. FIFA ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలనే లియోనెల్ మెస్సీ కల ఆదివారం నెరవేరింది.

అర్జెంటీనా, ఫ్రాన్స్
"#FIFAWorldCup ఫైనల్ సమయంలో సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసింది, ఇది ప్రపంచం మొత్తం ఒక విషయం గురించి వెతుకుతున్నట్లుగా ఉంది" అని పిచాయ్ ట్వీట్ చేశారు. ఇది గొప్ప ఆటలలో ఒకటని చెప్పాడు. "అర్జెంటీనా, ఫ్రాన్స్‌లను బాగా ఆడాయి. జోగో బోనిటో. #మెస్సీ కంటే ఎవ్వరూ దీనికి అర్హులు కాదు, గేమ్ ఆడటంలో ఇమ్హో ది గ్రేటెస్ట్. వాట్ ఎ స్వాన్‌సాంగ్" అని పిచాయ్ పోస్ట్ చేశాడు.

ఆధిపత్యం
Google సెర్చ్ ను 1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ స్థాపించారు. 2022లో 90 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో, Google సెర్చ్ ప్రస్తుతం మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. గూగుల్ సెర్చ్ ఇయర్ వైస్ ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారో కూడా వివరాలు వెల్లడిస్తుంది.
ఇది ఫుట్‌బాల్ గొప్పదనం
"ఒక బిలియన్ మందికి పైగా ప్రజలు తమ ఆటపై ఉన్న ప్రేమతో ఏకమయ్యారు. ఇది ఫుట్‌బాల్ గొప్పదనం. ఇది మనల్ని ఏకం చేసే నిజమైన గ్లోబల్ గేమ్" అని లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పోడ్‌క్యాస్ట్ హోస్ట్, USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో పరిశోధనా శాస్త్రవేత్త అయిన లెక్స్ ఫ్రిడ్మా పిచాయ్‌కి ట్వీట్ కు కామెంట్ చేశాడు.












Click it and Unblock the Notifications