ఒకే కంపెనీలో ఐదుగురు నోబెల్ గ్రహీతలు!
Google CEO: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన కంపెనీ సాధించిన అరుదైన మైలురాయిని ఉద్దేశించి ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు. మిషెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్, జాన్ క్లార్క్‌లకు 2025లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. గత రెండేళ్లలో గూగుల్‌తో సంబంధం ఉన్న ఐదుగురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు దక్కడం విశేషం. "ఈ ఉదయం మా కంపెనీలో ఐదుగురు నోబెల్ గ్రహీతలు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. కేవలం రెండేళ్లలోనే మూడు బహుమతులు దక్కాయి!" అని సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
గూగుల్ క్వాంటం ఏఐలో కీలక వ్యక్తులు
నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలలో డెవోరెట్, మార్టినిస్‌ల పాత్రను సుందర్ పిచాయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మిషెల్ డెవోరెట్ ప్రస్తుతం గూగుల్ క్వాంటం ఏఐ ల్యాబ్‌లో హార్డ్‌వేర్ విభాగానికి ముఖ్య శాస్త్రవేత్తగా ఉన్నారు. జాన్ మార్టినిస్ చాలా సంవత్సరాలుగా ఇదే ల్యాబ్‌లో హార్డ్‌వేర్ బృందానికి నాయకత్వం వహించారు.

క్వాంటం కంప్యూటింగ్ పునాది వేసిన పరిశోధన
మిషెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్, జాన్ క్లార్క్ చేసిన ప్రాథమిక పరిశోధన భవిష్యత్తు క్వాంటం కంప్యూటర్లకు మార్గం సుగమం చేసిందని సుందర్ పిచాయ్ కొనియాడారు. "భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మిషెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్, జాన్ క్లార్క్‌లకు అభినందనలు. 1980లలో వీరు చేసిన క్వాంటం మెకానిక్స్‌లో అగ్రగామి పరిశోధన... ఇటీవలి ఆవిష్కరణలను సాధ్యం చేసింది. భవిష్యత్తులో లోపాలను సరిచేసే క్వాంటం కంప్యూటర్లకు పునాది వేసింది" అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Congrats to Michel Devoret, John Martinis, and John Clarke on the Nobel Prize in Physics. 🔬🥼 Michel is chief scientist of hardware at our Quantum AI lab and John Martinis led the hardware team for many years.
— Sundar Pichai (@sundarpichai) October 7, 2025
Their pioneering work in quantum mechanics in the 1980s made recent…
గూగుల్ తరపున ఐదుగురు నోబెల్ గ్రహీతలు
గత రెండేళ్లలో గూగుల్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ఐదుగురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాలు దక్కాయి.
*డెమిస్ హస్సాబిస్-2024- రసాయన శాస్త్రం- గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ
*జాన్ జంపర్-2024-రసాయన శాస్త్రం-గూగుల్ డీప్‌మైండ్
*మిషెల్ డెవోరెట్-2025-భౌతిక శాస్త్రం-గూగుల్ క్వాంటం AIలో చీఫ్ సైంటిస్ట్ (ప్రస్తుతం)
*జియోఫ్రీ హింటన్-2024-భౌతిక శాస్త్రం-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధన (గూగుల్ పూర్వ ఉద్యోగి)
*జాన్ మార్టినిస్-2025-భౌతిక శాస్త్రం-గూగుల్ క్వాంటం AI హార్డ్‌వేర్ లీడర్ (పూర్వ ఉద్యోగి)
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications