Viral video : మహిళా జడ్జికి ఐలవ్యూ చెప్పిన నిందితుడు... దిమ్మతిరిగే రిప్లై...

ఆమె ఓ జడ్జి.. అతను ఓ దోపిడీ కేసులో నిందితుడు... విచారణ నిమిత్తం అతన్ని జడ్జి ముందు ప్రవేశ పెట్టారు... పోలీసుల చార్జిషీట్‌పై విచారణ చేపట్టిన జడ్జి తీర్పు ఇచ్చేందుకు సిద్దమయ్యారు... ఆమె అలా తీర్పు కాపీని చదివేందుకు సిద్దమవుతుండగా... నిందితుడు మధ్యలో కల్పించుకున్నాడు... కేసుకు సంబంధించి తన వాదన వినిపించేందుకో లేక జడ్జిని వేడుకునేందుకో కాదు... ఆమె అందాన్ని పొగడటమే గాక ఏకంగా ఐలవ్యూ చెప్పేశాడు. జడ్జిని ఇంప్రెస్ చేస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడో లేక తన తుంటరితనాన్ని కావాలనే బయటపెట్టుకున్నాడో గానీ జడ్జి మాత్రం గట్టిగానే బదులిచ్చింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి ఇటీవల ఓ చోరీకి పాల్పడ్డాడు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా జరిగిన కేసు విచారణ సందర్భంగా నిందితుడిని మహిళా జడ్జి తబితా బ్లాక్‌మోన్‌ ముందు ప్రవేశపెట్టారు. చార్జిషీట్‌ను పరిశీలించిన జడ్జి నిందితుడిని దోషిగా తేల్చారు. అనంతరం తీర్పు కాపీ చదవడం ప్రారంభించారు.

జడ్జికే లవ్ ప్రపోజల్...

జడ్జి తబితా తీర్పు కాపీని చదివేముందు నిందితుడు లూయిస్ మధ్యలో కల్పించుకున్నాడు. 'హౌ యూ డూయింగ్...' అంటూ ఆమెను పలకరించాడు. దానికి జడ్జి.. 'ఆల్‌రైట్... ఐయామ్ సార్.. హౌ ఆర్ యూ..' అని బదులిచ్చింది. అంతే లూయిస్ ఇక జడ్జిని ఇంప్రెస్‌ను చేసేందుకు మరో అడుగు ముందుకేశాడు. 'మీరు చాలా అందంగా ఉన్నారు.. ఈ మాట మీతో చెప్పాలి.. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ..' అంటూ చెప్పాడు. అతని మాటలకు చిన్నగా నవ్విన జడ్జి తబితా ఆ తర్వాత గట్టిగానే బదులిచ్చారు.

శిక్ష తప్పలేదు...

శిక్ష తప్పలేదు...

తనను పొగిడినందుకు థ్యాంక్స్ చెప్తూనే ఈ వేషాలు తన వద్ద కుదరవని చెప్పారు. పొగడ్తలు నీకు ఎక్కడైనా ఉపయోగపడుతాయేమో గానీ ఇక్కడ మాత్రం పనిచేయవు అని చెప్పారు. నేరానికి తగిన శిక్ష తప్పదన్నారు. అతనికి 5వేల డాలర్ల జరిమానా విధించారు.నిజానికి గతంలోనూ లూయిస్ నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. 2019లో జైలు నుంచి విడుదలైన అతను మళ్లీ నేరాల బాట పట్టాడు. చోరీ కేసులో ఇప్పుడిలా జడ్జి ముందు హాజరై అతి తెలివి తేటలు ప్రదర్శించాడు. లూయిస్ జడ్జికి ప్రపోజ్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+