Donald Trump.. మెడకు మరో ఉచ్చు: ఇవాంకాపైనా

వాషింగ్టన్: అమెరికన్ టాప్ పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో విచారణను ఎదుర్కొన్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. మరో కేసులో ఆయన న్యాయస్థానానికి హాజరయ్యారు. కొన్ని గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు సమధానాలను ఇచ్చారు.

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 2016 హుష్ మనీ చెల్లింపుల కేసుల్లో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. నేరారోపణలతో అరెస్టయిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే. అమెరికా చరిత్రలో ఇదొక అసాధారణ ఘట్టం. 2024లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయడానికి సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ అరెస్ట్ కావడం సంచలనం రేపింది.

Donald Trump was questioned under oath in a civil fraud case

ఈ పరిస్థితుల్లో ఆయన తాజాగా మరో విచారణను ఎదుర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన ముగ్గురు పిల్లలు వ్యాపారంలో మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై న్యూయార్క్ మన్‌హట్టన్ న్యాయస్థానం విచారించింది. న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్ లెటీటియా జేమ్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

ట్రంప్ ప్రభుత్వ హయాంలో ఈ మోసం సంభవించిందని ఆరోపిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, ఇవాంక ట్రంప్‌పై లెటీటియా జేమ్స్ కేసు వేశారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఉంటూ తన కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించేలా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారని, తన ఆస్తుల విలువపై తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

ట్రంప్ ఆస్తుల నికర విలువను తప్పుగా చూపించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు, బ్యాంకర్లు, బీమా సంస్థలను తప్పుదారి పట్టించారని లెటీటియా జేమ్స్.. న్యాయస్థానంలో వాదించారు. ఫలితంగా- ఆయా సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకోగలిగారని, దీని ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. ప్రతివాదిగా కోర్టుకు హాజరైన డొనాల్డ్ ట్రంప్- వాటన్నింటిపైనా సమాధానాలు ఇచ్చారు.

విచారణను ఎదుర్కొనడానికి న్యూయార్క్‌కు బయలుదేరి రావడానికి ముందు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా సైట్- ట్రూత్‌లో కొన్ని కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ సివిల్ కేసును తనపై ఉద్దేశపూరకంగా బనాయించారని వ్యాఖ్యానించారు. దీని గురించి తాను చింతించట్లేదని పేర్కొన్నారు. దీన్నొక హాస్యాస్పదమైన కేసుగా అభివర్ణించారు. రాజకీయంగా తనను ఇబ్బందులు కలిగించాలనే దురుద్దేశం కనిపిస్తోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+