ఫ్లోరిడా కాల్పులు: బుల్లెట్‌ను అడ్డుకున్న ల్యాప్‌టాప్
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తిని అతని ల్యాప్‌టాప్ కాపాడింది.
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తిని అతని ల్యాప్‌టాప్ కాపాడింది. ఆగంతకుడు కాల్పులు జరుపుతున్న సమయంలో అందరూ హడావుడిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
ఎయిర్ పోర్టులో దుండగుడి కాల్పులు, 5గురి మృతి, అరెస్ట్
స్టీవ్ ఫ్రాపియర్ అనే వ్యక్తి కూడా అదే తరహాలో విమానాశ్రయం నుంచి బయటపడేందుకు పరుగులు తీశాడు. అయితే భుజానికి వేసుకున్న ల్యాప్‌టాప్ బ్యాగే ఆయనకు రక్షణ కవచంగా మారింది. పరుగులు తీస్తున్న స్టీవ్ దిశగా షూటర్ కాల్పులు జరిపాడు.

అతనివైపు దూసుకొచ్చిన బుల్లెట్.. వీపుకు వేసుకున్న బ్యాగ్‌కు తగిలింది. అయినా ప్రాణ భయంతో అలాగే పరుగులు తీశాడు. వాషింగ్‌రూమ్‌కు వెళ్లిన తర్వాత బ్యాగ్ చూశాడు. ల్యాప్‌టాప్‌కు బుల్లెట్ తగిలినట్లు గ్రహించాడు.
ఆ బ్యాగ్‌ను అతను వెంటనే పోలీసులకు అప్పగించాడు. ఒకవేళ బ్యాగ్‌లో ల్యాప్‌టాప్ లేకుంటే ఆ బుల్లెట్ తన వీపులో దిగేదని స్టీవ్ చెప్పాడు. విమానాశ్రయంలో సుమారు 45 సెకండ్ల పాటు కాల్పులు జరిగినట్లు మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications