ఫ్రాన్స్‌లో మరోసారి ఉగ్రదాడి: 80 మంది దుర్మరణం

Posted By:
Subscribe to Oneindia Telugu

పారిస్: ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాద దాడిలో 77 మంది మరణించారు. గత 8 నెలల కాలంలో నైస్ నగరంలో ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. మందుగుండు సామగ్రితో ఉన్న భారీ ట్రక్కు ఉత్సవాలు జరుపుకుంటున్న జనంపైకి దూసుకెళ్లింది.

France: 80 killed after truck rams into crowd in Nice; attacker shot dead

ఉగ్రవాదులే ట్రక్కుతో దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఫ్రాన్స్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దాడిలో మరో వందికి పైగా గాయపడ్డడారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రక్కులోని వ్యక్తులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

దాంతో బుల్లెట్లతో ట్రక్కుకు తూట్లు పడ్డాడయి. ఘటన జరిగిన వెంటనే నైస్ నగరాన్ని ఉగ్రవాద వ్యతిరేక దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ట్రక్కు డ్రైవర్‌ కాల్పుల్లో మరణించాడు. ట్రక్కులో 31 ఏళ్ల ఫ్రెంచ్ టునీషియా పౌరుడికి చెందిన పత్రాలు కనిపించినట్లు, భారీగా ఆయుధాలూ తుపాకులు ఉన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.

France: 80 killed after truck rams into crowd in Nice; attacker shot dead

నగరంలో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నైస్ నగర మేయరు క్రిస్టియన్ ఈస్ట్రోసి కోరారు. నిరుడు నవంబరులో ప్యారిస్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 130 మంది మరణించారు.

ఫ్రాన్స్ టెర్రర్ దాడి ఇలా..., ఫ్రెంచ్ వ్యక్తే: భారతీయులు క్షేమం

ఫ్రాన్స్ లో జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. ఈ దాడిలో అమాయకులు మరణించారని వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ లో ఉన్న బ్రిటీష్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశం కోరింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A truck ploughed into a crowd in the French Riviera resort of Nice, killing at least 80 and leaving scores injured in an attack on revellers watching a Bastille Day fireworks display, authorities said Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X