H-1B Visa ల వ్యవహారంలో అనూహ్య పరిణామం.. !!
అమెరికాలో H-1B Visa ల వ్యవహారం ముదురుతోంది. ఫేక్ వీసాలతో వేలాదిమంది భారతీయులు అమెరికాకు తరలివెళ్తోన్నారనే ఆందోళన క్రమంగా వ్యాపిస్తోంది. కొత్త హెచ్ 1బీ వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. నకిలీ విసాలతో భారతీయులు ఇక్కడికి వస్తోండటం పట్ల నిధులు, ఉద్యోగాలు అమెరికన్ వర్కర్లు, ప్రొఫెషనల్స్ కు దక్కట్లేదనే భావన వ్యక్తమౌతోంది. దీనిపై ఇప్పటికే టెక్సాస్ స్టేట్ అనేక ఆంక్షలను విధించింది కూడా.
ఇదే వ్యవహారం.. ఇప్పుడు తాజాగా టెక్సాస్ లోని ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. స్థానికులు, భారత సంతతికి చెందిన పౌరుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. హెచ్-1బీ ద్వారా భారతీయులు వీసా మోసాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని మితవాదులు ఆరోపించారు. ఫేక్ హెచ్ 1బీ వీసాల ద్వారా వచ్చిన భారతీయులు ఫ్రిస్కో సిటీ మొత్తాన్నీ ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు చేశారు.

దీనికి వ్యతిరేకంగా రైట్ వింగ్ నాయకులు కైలీ క్యాంప్‌బెల్, మార్క్ పలాషియానో ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. విసా విధానాల పట్ల అసంతృప్తితో ఉన్న పౌరులను ఆహ్వానించారు. హెచ్-1బీ వీసా కార్యక్రమం ద్వారా జరుగుతున్న మోసం, భారతీయుల దురాక్రమణపై ఆగ్రహంతో రగిలిపోతున్న వారందరూ నార్త్ టెక్సాస్ నలుమూలల నుండి ఈ సమావేశానికి హాజరయ్యారని, తమ నిరసనలను తెలియజేశారని డల్లాస్ అబ్జర్వర్ తెలిపింది.
ఫ్రిస్కోకు చెందిన నార్త్ టెక్సాస్ స్టూడెంట్ డైలాన్ లా మాట్లాడుతూ తాము చెల్లిస్తోన్న పన్నుల ద్వారా నిర్మించిన క్లాస్ రూమ్ లల్లో తాము విదేశీయులుగా మారుతున్నామని అన్నారు. ఫ్రిస్కోలో భారతీయ జనాభా విపరీతంగా పెరగడం, ఇక్కడ వీసా మోసాలు రెట్టింపు కావడం ఏ మాత్రం యాదృచ్చికం కాదని మార్క్ పలాషియానో అన్నారు. ఫ్రిస్కో సిటీ వెంటనే మేల్కోవాలని అన్నారు. ఇదే కొనసాగితే త్వరలో ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ మొత్తం భారతీయులతో నిండిపోతుందని హెచ్చరించారు.
ఈ వీసా కార్యక్రమం అర్హులైన అమెరికన్ల నుండి ఉద్యోగాలను లాక్కుందని, నార్త్ టెక్సాస్‌లో అవాంఛనీయ జనాభా మార్పులకు కారణమైందని చెప్పారు. దీన్ని తాను, తన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నట్లు తేల్చి చెప్పారు మార్క్ పలాషియానో. ఈ ఆరోపణలను పలువురు భారత-అమెరికన్లు గట్టిగా తిప్పికొట్టారు.
ఫ్రిస్కో సిటీ.. తమ ఉనికి ద్వారా ప్రయోజనం పొందుతోందని ముని జనగారాజన్, అమిత్ రాజాధ్యాక్షవాదించారు. డల్లాస్ మార్నింగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాము కడుతున్న పన్నుల వల్ల ఈ సిటీ పునర్నిర్మితమౌతోందని అన్నారు. అనేక సదుపాయాలు స్థానికులకు లభిస్తోన్నాయని,ప్రపంచ స్థాయి పార్కులకు నిలయమైందని, ఫ్రిస్కో ఐఎస్‌డికి పెద్దఎత్తున నిధులను సమకూరుస్తున్నామని అన్నారు.
-
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!











Click it and Unblock the Notifications