వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ఏమైనా రాస్కోవచ్చు: డొనాల్డ్ ట్రంప్ సొంత కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సోషల్ మీడియాకు దూరమైన వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా ఓ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె. ట్రంప్ (From the Desk of Donald J. Trump) అని పేరు పెట్టారు. తన మద్దతుదారులతో సంప్రదింపులు నిర్వహించడానికి, వారి నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది. మీడియా బులెటిన్లు, స్టేట్‌మెంట్లతో పాటు వీడియో క్లిప్పింగులను కూడా పోస్ట్ చేసే సౌకర్యం ఈ వెబ్‌సైట్‌లో ఉంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఆయన చేసిన పలు పోస్టింగులు, వీడియో క్లిప్పింగులు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దీనితో సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్‌బుక్ ఆయనను నిషేధించాయి. వివాదాలకు కారణమైన డొనాల్డ్ ట్రంప్ పోస్టింగులను తొలగించాయి. ట్విట్టర్ మేనేజ్‌మెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను ఏకంగా శాశ్వతంగా బ్యాన్ చేసింది. దీనితో ఆయన బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు.

From the desk of Donald J. Trump: former US President launches new communications platform

ఈ పరిస్థితుల్లో మళ్లీ సోషల్ మీడియాలోకి అడుగు పెట్టడానికి సొంతంగా ఓ కమ్యూనికేషన్ల వ్యవస్థ, ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసుకున్నారు. ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె. ట్రంప్ పేరుతో తొలిదశలో ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. క్రమంగా దీన్ని మరింత విస్తరించనున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ తరహాలో మైక్రో బ్లాగింగ్ వ్యవస్థగా దీన్ని రూపుదిద్దనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తన అభిప్రాయాలను ఆయన పంచుకోనున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించే ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారని తెలుస్తోంది. ట్రంప్‌పై విధించిన నిషేధం ఒకట్రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉందని, దాన్ని కూడా వినియోగించుకుంటామని ట్రంప్ ప్రతినిధి జేసన్ మిల్లర్ తెలిపారు.

English summary
Former President Donald Trump has launched his own online platform. The new website is called "From the Desk of Donald J. Trump." It will allow the former president to communicate with his followers without interacting with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X