అభయం ఇదే మిత్రమా

PM Modi at BRICS: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మకమైన బ్రిక్స్ అత్యున్నత సమావేశంలో పాల్గొనడానికి ఈ ఉదయమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం కాజన్‌కు చేరుకున్నారు. బ్రిక్స్ సమ్మిట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది ఈ నగరమే.

బెల్జియం, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలకు బ్రిక్స్‌లో సభ్యత్వం ఉంది. ఆయా దేశాల పేర్లల్లో తొలి అక్షరాన్ని తీసుకుని దీనికి ఈ పేరు పెట్టారు. ఇరాన్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, టర్కీ దేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగుతున్నాయి. ఈ సారి ఈ సమావేశానికి రష్యా వేదిక.

Fully support the early establishment of peace and stability says PM Modi at BRICS summit

నేడు ఈ సదస్సు ప్రారంభమైంది. 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇది 16వ సమ్మిట్. ప్రధాన సమావేశంలో బుధ, గురు వారాల్లో జరుగుతుంది. బ్రిక్స్ సైడ్ లైట్స్‌లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. హిందీలో ప్రసంగించారు. మూడు నెలల వ్యవధిలో రష్యాలో పర్యటించడం, పుతిన్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మూడు నెలల్లో రెండుసార్లు రష్యాకు రావడం తమ రెండు దేశాల మధ్య గల స్నేహాన్ని, సన్నిహిత సంబంధాలకు ఓ ఉదాహరణగా అభివర్ణించారు మోదీ. దశాబ్దాల కాలంగా రష్యా- భారత్ మధ్య దౌత్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతూ వస్తోన్నాయని, తన పర్యటనలతో అవి మరింత బలోపేతమౌతాయని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు 15 దఫాలుగా జరిగిన సదస్సుతో బ్రిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఇందులో చేరాలని కోరుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు సమైక్యంగా, పరస్పర సమన్వయంతో సమష్టిగా అభివృద్ధి చెందుతోండటమే దీనికి కారణమని అన్నారు.

రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని మోదీ ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించిన తీర్మానాలను బ్రిక్స్ సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్ శాంతికాముక దేశమని, రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని గుర్తు చేశారు.

ఇప్పటికీ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని, చర్చల ద్వారా ఉద్రిక్తతలను నివారించుకోవచ్చని, సమస్యలను పరిష్కరించుకోవచ్చని నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు. శాంతి, సుస్థిరతకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+