ఆప్ఘాన్ పరిస్థితులపై జీ7 భేటీలో చర్చిస్తాం, ప్రజలకు మా మద్దతు: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్: తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న వారం రోజుల తర్వాత బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వర్చువల్‌గా జరిగే జీ7 నేతలు వచ్చే మంగళవారం రోజున ఆప్ఘాన్ పరిస్థితులపై చర్చించనున్నారని ఆయన ప్రకటించారు. మానవ సంక్షోభం తలెత్తకుండా ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు.

ఆప్ఘాన్ ప్రజలకు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ప్రపంచ దేశాలు ఇందుకు ఐక్యంగా పనిచేయాలని వ్యాఖ్యానించారు.
బ్రిటన్ తోపాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూనైటెడ్ స్టేట్స్ దేశాల జీ7కు ప్రస్తుతం అధ్యత వహిస్తున్న బోరిస్ జాన్సన్ ఆప్ధాన్ పరిస్థితులపై చర్చించాలని, ఇందుకోసం సమావేశం ఏర్పాటు చేయాలని జీ7 దేశాలకు చెప్పారు. తాలిబన్ల అరాచకాల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని దేశాలకు పిలుపునిచ్చారు.

కాగా, ఇటీవల బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ సంచలన ప్రకటన చేశారు. అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో కలిసి పనిచేయటానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. అవసరమైతే తాలిబన్లతో కలిసి పనిచేస్తామని బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. ప్రస్తుతం అఫ్గాన్‌ సంక్షోభం పరిష్కారంకోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని, పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

 G7 To Discuss Afghanistan On August 24th: UK PM Boris Johnson, ‘Vital to support Afghan people’

ఈ నేపథ్యంలో తాలిబన్లతో కలిసి చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తద్వారా అఫ్గాన్‌ పౌరులకు భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.కొన్ని సమస్యల వల్లే బ్రిటన్ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చామని చెప్పారు. కాగా తాలిబన్లతో కలిసి పని చేయటానికి తమకు అభ్యంతరం లేదని తొలుత చైనా ప్రకటించింది. ఆ తర్వాత ఇదే బాటలో పాకిస్థాన్‌, రష్యా దేశాలు తాలిబన్లకు మద్ధతు పలికిన సంగతి తెలిసిందే.

శృతిమించుతున్న తాలిబన్ల అరాచకాలు

ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్‌‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాలిబన్ల ఆటవిక, రాక్షసత్వ పరిపాలనకు భయపడి.. దేశం విడిచి వెళ్లిపోతోన్న ఆఫ్ఘనిస్తానీయులతో రోజూ క్రిక్కిరిసి పోతోంది. వేలాదిమంది కాబూలీవాలాలు ఇప్పటికీ విమానాశ్రయంలోనే గడుపుతోన్నారు. అందుబాటులో ఉన్న విమానాన్ని పట్టుకుని దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలను సాగిస్తోన్నారు.

ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్ అమెరికా సైనిక బలగాల ఆధీనంలో ఉంది. అందుకే- వేర్వేరు దేశాలకు చెందిన పౌరుల తరలింపు సజావుగా సాగుతోంది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన పౌర విమానాలు రాకపోకలు సాగిస్తోన్నాయి. తమ దేశ పౌరులను తరలించడంలో నిమగ్నమై ఉన్నాయి. రెండు ఎయిరిండియా విమానాల ద్వారా 150 మందికి పైగా స్వదేశానికి చేరుకున్నారు. అలాగే- సీ-17 యుద్ధ విమానాల ద్వారా కూడా భారతీయుల తరలింపు ప్రక్రియ సాగుతోంది

ఇప్పటిదాకా సైనిక విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకలకే పరిమితమైన కాబుల్ విమానాశ్రయంలో ఇక పౌర విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిణామాలు విమానాశ్రయం వద్ద భారీగా తొక్కిసలాటకు దారి తీశాయి. తాలిబన్ల పరిపాలన నుంచి ఎలాగైనా బయటపడి తీరాలనే ప్రయత్నంలో వేలాదిమంది ఆప్ఘనిస్తానీయులు ఈ విమానాశ్రయానికి చేరుకుంటోన్నారు. ఫలితంగా తొక్కిసలాట నెలకొంది. తాజాగా ఈ మధ్యాహ్నం సంభవించిన తొక్కిసలాటలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు

కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయాన్ని బ్రిటన్ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. మూడో గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. రెండు ప్రధాన గేట్లు మూసివేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఆప్ఘనిస్తానీయులు మూడో గేట్ వద్దకు చేరుకున్నారని, ఒక్కసారిగా రన్ వే మీదికి దూసుకుని వచ్చే క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుమంది వరకు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని స్పష్టం చేశారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ఉందని తెలుస్తోంది.

కాగా, ఆప్ఘాన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలింపు కొనసాగుతోంది. తాజాగా, భారత్ రెండు ఎయిరిండియా విమానాలను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించింది. భారతీయుల తరలింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న ఆగస్టు 14వ తేదీ తరువాత భారత్ నుంచి కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన రెండో సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ ఇదే. పౌర విమానాలు రాకపోకలు సాగించడానికి అనుమతి లభించడంతో- అల్లకల్లోలంగా మారిన కాబుల్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ఇక మరింత ముమ్మరం చేసింది. తాజాగా, 400 మందిని ఆప్ఘాన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+