Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిల్లల చదువులో విజయానికి కారణం జన్యుపరమైన కారణాలే: పరిశోధకులు

పిల్లల చదువు విషయంలో వారు ఏమేరకు రాణిస్తున్నారనేది జన్యువులపై ఆధారపడి ఉంటుందని కొత్త పరిశోధన ఒకటి వెల్లడించింది. ప్రాథమిక విద్య నుంచి హైస్కూలు విద్య వరకు చదువులో పిల్లలు సాధించిన విజయాలు కేవలం జన్యు ఆధారంగానే జరుగుతాయనే ఆసక్తికరమైన విషయాన్ని ఈ కొత్త స్టడీ బయటపెట్టింది. చదువులో సాధించిన విజయాలు జీవిత ఘటనలతో ముడిపడి ఉంటాయని ఇది గతకొన్నేళ్లుగా చేసిన పరిశోధనల ద్వారా వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్కూళ్లో చక్కటి ప్రదర్శన కనబరిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారని ఈ స్టడీ పేర్కొంది.

"పిల్లలు స్కూల్లో సాధించిన మూడింట రెండింతల విజయాలు పిల్లల డీఎన్ఏలో వ్యత్యాసాల బట్టి వివరించొచ్చని అయితే ఒక విద్యార్థి ఓవరాల్ సక్సెస్‌కు పూర్తిగా జన్యుపరమైన కారణాలే అని చెప్పలేమన్నారు" సైకాలజీ పోస్ట్ డాక్టరల్ మార్గరిటా మలాన్‌చిని. స్కూళ్లో చదివిన పిల్లల ప్రదర్శన స్కూలు జీవితం మొత్తంలో స్థిరంగా ఉంటే డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా అదే స్థిరత్వాన్ని మెయింటెయిన్ చేస్తారని పరిశోధనల్లో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. ఇలా స్కూళ్లో చదువుతున్న విద్యార్థులు 70శాతం విజయానికి జన్యుపరమైన కారణాలు ఒకటైతే... కవలలు కలిసి చదువుకోవడం, వారున్న వాతావరణం తమ సక్సెస్‌లో 25శాతం పాత్ర పోషిస్తుండగా, వేర్వేరు టీచర్లు, వేర్వేరు మిత్రులు కలిగి ఉండటంతో మరో 5శాతం మంది విజయాలు నమోదు చేస్తున్నారని పరిశోధకులు అభిప్రాయడ్డారు.

Genetic factors are key to academic success, reveals study

చదువులో విజయం సాధించడమంటే జ్ఞానం అజ్ఞానం మధ్య జరిగే ప్రక్రియని మలాంచిని చెప్పారు. గతంలో చదువులు పర్సనాలిటీ, అలవాటు సమస్యలు, స్ఫూర్తి, ఆరోగ్యంతో పాటు ఇతరత్ర కారణాలపై ఆధారపడి ఉండేవన్నారు మలాంచిని. కొన్నేళ్ల తర్వాత విద్యావిధానంలో మార్పులు రావడంతో ప్రాథమిక, ఉన్నత విద్యలో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. వీటన్నిటి ఆధారంగానే విద్యార్థులు చదువుల్లో సక్సెస్ అయ్యేందుకు కారణం ఏమిటనేదానిపై విశ్లేషణ జరుగుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+