మిషెల్ ఒబామాను ఇష్ట‌ప‌డ్డ జార్జ్ బుష్!

జార్జ్ బుష్, మిషెల్ ఒబామా. వీళ్లిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు జార్జ్ బుష్ నేరుగా చెప్పేశారు.. తనకు మిషెల్ ఒబామా అంటే ఇష్టమని.

న్యూయార్క్: ఒకరు అమెరికా మాజీ ప్రెసిడెంట్.. మరొకరు మాజీ ఫస్ట్ లేడీ. వాళ్ల పార్టీలు వేరు.. వాళ్ల ప్రభుత్వాలూ వేరు. అసలు జనరేషన్ కూడా వేరే. కానీ వాళ్లిద్దరి నడుమ ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

వాళ్లే.. జార్జ్ బుష్, మిషెల్ ఒబామా. వీళ్లిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు జార్జ్ బుష్ నేరుగా చెప్పేశారు.. తనకు మిషెల్ ఒబామా అంటే ఇష్టమని. తాను వేసే జోక్ లను మిషెల్ అమితంగా ఇష్టపడుతుందని, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను మెచ్చుకునే మిషెల్ ను తాను కూడా ఎంతో ఇష్టపడతానని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పోర్ట్రెయిట్స్ ఆఫ్ కరేజ్: ఎ కమాండర్ ఇన్ చీఫ్స్ ట్రిబ్యూట్ టు అమెరికా వారియర్స్ పేరుతో బుష్ రాసిన ఒక పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన జార్జ్ బుష్.. మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ పై తనకు ఉన్న అభిమానాన్ని తెలియజేశారు.

George Bush explains his fondness for Michelle Obama

గత ఏడాది టెక్సాస్ లో జరిగిన నాన్సీ రీగన్ మెమోరియన్ సర్వీస్ లో జార్జ్ బుష్, మిషెల్ ఒబామా పక్కపక్కనే కూర్చున్నారు. ఆఫ్రికన్-అమెరికన్ మ్యూజియంను ప్రారంభించినప్పుడు జరిగిన కార్యక్రమంలో కూడా వారిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.

ఆ సమయంలో మిషెల్.. వెనకనుంచి జార్జ్ బుష్ ను ఆత్మీయంగా హత్తుకుంది. ఆ పలకరింపు మిషెల్ నిజమైన ప్రేమను చాటుతుందని బుష్ అన్నారు. ఈ ఇద్దరూ ఎప్పుడు, ఎక్కడ కలుసుకున్నా జోకులు పేలుస్తూ ఉంటారు.

ఒబామా దంపతుల చుట్టూ ఎప్పుడూ సీరియస్ గా ఉండే వ్యక్తులు ఉంటుంటారని, కానీ తాను జోకులు వేస్తున్నప్పుడు మాత్రం మిషెల్ ఎంజాయ్ చేస్తుందని, దాన్ని తాను ఇష్టపడతానని బుష్ తెలిపారు. జనవరిలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకరోత్సవ సమయంలో కూడా బుష్, మిషెల్ ఇద్దరూ క్లోజ్ గా కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+