పావురం వేటలో జర్మనీ పోలీసులు: దాని విలువ రూ.1.20 కోట్లు
బెర్లిన్: ఓ పావురం కోసం జర్మనీ పోలీసులు వేట ప్రారంభించారు. దాని ఆచూకీ చెప్పినవారికి భారీ బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు కనిపించకుండా పోయి ఓ పావురాన్ని పట్టుకోవడానికి నానా తంటాలుపడుతున్నారు.

ఆ పావురం విలువ ఏకంగా లక్షా యాభై వేల యూరోలట. అది కోటీ 84 వేల అమెరికా డాలర్ల విలువ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ. 1.20 కోట్లు. పావురం యజమాని దానికి కట్టిన విలువ ఇది. అదృశ్యమైన పావురం పేరు 'ఏఎస్ 969'.
ఈ పావురం ఆచూకీ తెలిపిన వారికి 10 వేల యూరోల (దాదాపు రూ. 8 లక్షలు) బహుమతిని ప్రకటించాడు. డ్యూస్సెల్డార్ఫ్ నగర శివార్లలోని పక్షిశాలలో ఉన్న ఈ పావురాన్ని శనివారం రాత్రి ఎవరో దొంగిలించారు. శివారు ప్రాంతంలో ఆరేళ్ల ఆ పావురాన్ని దొంగిలించుకుపోయారని యజమాని చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications