Angela Merkel: జర్మనీలో రాజకీయంగా ఓ శకం ముగిసినట్టే
బెర్లిన్: జర్మనీకి సుదీర్ఘకాలం పాటు ఛాన్సలర్‌గా వ్యవహరించిన ఏంజెలా మెర్కెల్ శకం దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. ఆదివారం నాటి ఎన్నికల్లో ఆమె సారథ్యాన్ని వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ప్రతిపక్ష పార్టీ స్వల్ప మెజారిటీని సాధించింది. 16 సంవత్సరాల తరువాత ఏంజెలా మెర్కెల్ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అధికార మార్పిడి చోటు చేసుకోవడానికే అధిక అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. తుది విడత ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జర్మనీలో ఆదివారం ఎన్నికలను నిర్వహించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటించారు అక్కడి ఎన్నికల కమిషన్ అధికారులు. ఏంజెలా మెర్కెల్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ 24.3 శాతం ఓట్లను సాధించింది. సోషల్ డెమొక్రటిక్ పార్టీకి 25.9 శాతం ఓట్లు పడ్డాయి. స్వల్ప మెజారిటీని నమోదు చేసుకుంది సోషల్ డెమొక్రటిక్ పార్టీ. మిగిలిన గ్రీన్ పార్టీ 14.5, లిబరల్ ఫ్రీ డెమొక్రటిక్ పార్టీ 11.5, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ-10.5, డై లింకె పార్టీ-5 శాతం మేర ఓట్లను అందుకున్నాయి. తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్/క్రిస్టియన్ సోషల్ యూనియన్ (కన్జర్వేటివ్) పార్టీ కంటే సోషల్ డెమొక్రటిక్ పార్టీకి పోల్ అయిన ఓట్ల శాతం నామమాత్రంగా ఉంది. దీన్ని భర్తీ చేసుకోవడానికి ఏంజెలా మెర్కెల్.. ఇతర పార్టీలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు లేకపోలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలంటూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు ఒలాఫ్ ష్కోల్జ్ డిమాండ్ చేస్తోన్నారు.
తుది విడత ఫలితాలు వెలువడే సమయానికి తాము ఆధిక్యతలో నిలుస్తామని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్/క్రిస్టియన్ సోషల్ యూనియన్ (కన్జర్వేటివ్) పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలను కూడా కలుపుకొని ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికోసం 14.5 శాతం మేర ఓట్లు సాధించిన గ్రీన్ పార్టీ, 11.5 శాతం ఓట్లు పోల్ అయిన లిబరల్ ఫ్రీ డెమొక్రటిక్ పార్టీని కలుపుకొని కన్జర్వేటివ్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నట్లు జర్మనీ మీడియా వెల్లడించింది.
Recommended Video
కన్జర్వేటివ్స్‌కు మద్దతు ఇవ్వడానికి- పార్లమెంట్‌లో మూడో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన గ్రీన్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించాల్సి ఉంటుందనే షరతును ముందుకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. సోషల్ డెమొక్రటిక్ పార్టీ తరఫున జర్మనీ ఛాన్సలర్ అభ్యర్థి ఒలాఫ్ ష్కోల్జ్ వాదన మరోలా ఉంటోంది. ఎన్నికల్లో తామను మెజారిటీ ప్రజలు ఎన్నుకొన్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఓటింగ్ ముగిసిన తరువాత ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications