వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1000కిపైగా లుఫ్తాన్స విమానాలు రద్దు: కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: లుఫ్తాన్స పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. భారీ సంఖ్యలో సిబ్బంది విధులను బహిష్కరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జర్మనీ అంతటా కుటుంబాలు తమ వేసవి సెలవులకు బయలుదేరుతున్న సమయంలో.. 1,000 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేస్తున్నట్లు డ్యుయిష్ లుఫ్తాన్స తెలిపింది.

సమ్మెలు, సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే లుఫ్తాన్సాతో సహా విమానయాన సంస్థలు వేలాది విమానాలను రద్దు చేయవలసి వచ్చింది. ప్రధాన విమానాశ్రయాల వద్ద గంటల తరబడి ప్రయాణికుల క్యూలు నిలిచాయి. కోవిడ్-19 సంబంధిత లాక్‌డౌన్‌ల తర్వాత ప్రయాణించడానికి ఆసక్తిగా ఉన్న హాలిడే మేకర్స్ ఇది నిరాశపర్చింది.

ground staff walkout: Lufthansa cancels over 1000 flights

జర్మనీ ఫ్లాగ్‌షిప్ క్యారియర్ దాని ఫ్రాంక్‌ఫర్ట్ హబ్‌లో 678 విమానాలను రద్దు చేసింది, వీటిలో ఎక్కువ భాగం బుధవారం షెడ్యూల్ చేయబడ్డాయి, మ్యూనిచ్‌లో 345 విమానాలను రద్దు చేసినట్లు లుఫ్తాన్స మంగళవారం తెలిపింది.

భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో 1,30,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. 9.5% వేతన క్లెయిమ్ కోసం కార్మిక సంఘం వెర్డి పిలుపునిచ్చిన సమ్మె ముగిసిన తర్వాత.. గురువారం, శుక్రవారం మరికొన్ని రద్దులు, ఆలస్యం జరగవచ్చని లుఫ్తాన్స పేర్కొంది.

English summary
ground staff walkout: Lufthansa cancels over 1,000 flights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X