పాకిస్తాన్ అండర్ అటాక్..: భారీ ఉగ్రదాడితో దద్దరిల్లుతున్న పెషావర్
పాకిస్తాన్ లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఏకంగా పారామిలటరీ బలగాల ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎంతమంది మరణించారనేది తెలియరాలేదు. ప్రాణనష్టం భారీగా ఉండొచ్చని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ దాడిని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ చీఫ్ డాక్టర్ మియాన్ సయీద్ అహ్మద్ ధృవీకరించారు. సంఘటన స్థలాన్ని భద్రత బలగాలు చేరుకున్నాయని, పరిస్థితిని సమీక్షిస్తోన్నామని అన్నారు.
పెషావర్‌లోని ఫెడరల్ కాన్‌స్టాబులరీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ప్రధాన కార్యాలయం గేటు వద్ద ఓ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు తర్వాత కాల్పుల శబ్దం వినిపించింది. ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని సయీద్ అహ్మద్ తెలిపారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించాయి. పేలుడు తర్వాత కాల్పులు జరగడం వల్ల ప్రాణనష్టం అధికంగా ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

పెషావర్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో ఉందీ పారామిలటరీ బలగాల ప్రధాన కార్యాలయం. ఆర్మీ కంటోన్మెంట్‌కు సమీపంలో కొనసాగుతోంది. గతంలో ఫెడరల్ కాన్‌స్టాబులరీగా పిలిచేవారు. ఈ మధ్యకాలంలోనే పారామిలటరీ ఫోర్స్ గా పేరు మార్చిందక్కడి ప్రభుత్వం. ఈ ఉదయం 9 నుంచి 9:30 గంటల ప్రాంతంలో ఆత్మాహూతి దాడి సంభవించింది. ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించడానికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నించాడు. అతన్ని గేటు వద్దే నిలిపివేశారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో అక్కడికక్కడే తనను తాను పేల్చుకన్నాడు.
పాకిస్తాన్ లో.. ప్రత్యేకించి ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్స్ లల్లో ఉగ్రవాద కార్యకలాపాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌లో ఇదే ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని బన్నూ జిల్లాలో పారామిలటరీ బలగాల కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మరణించారు. అయిదుమంది ఉగ్రవాదులు హతం అయ్యారు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.
Suicidal attack confirmed .
— Global perspective (@Global__persp1) November 24, 2025
IG Khyber Pakhtunkhwa Police Zulfiqar Hameed told Geo News that two suicide bombings took place at the Federal Constabulary Headquarters in Saddar, Peshawar.
Join Telegram channel -- https://t.co/hJdqZr3vvx https://t.co/30rf2uMHSu pic.twitter.com/b9UcN2L0Td
ఈ ప్రధాన కార్యాలయాన్ని సైన్యం, పోలీసులు, భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోడ్డును మూసివేశారు. దాడి జరిగిన ప్రాంతం సమీపంలో భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల మధ్య కాల్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Peshawar FC HQ under attack:
— War & Gore (@Goreunit) November 24, 2025
Following two blasts, firing continues,
Ambulances are reaching the hq. https://t.co/4WBk4BC0ci pic.twitter.com/Sab4KHWtQe
-
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications