• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక గోపి 14 మంది గోపికలు: ఎరవేశాడు... కోమాలోకి వెళ్లాడు ఇదీ స్టోరీ..!

|

ఈ రోజుల్లో ఒక అమ్మాయిని మెయింటెయిన్ చేయడమే కష్టంగా ఉంటే ఒక అబ్బాయి మాత్రం ఏకంగా 14 మంది అమ్మాయిలను లైన్‌లో పెట్టాడు. అది కూడా ఒకరికి ఇంకొకరు తెలియకుండా యమ జాగ్రత్త పడ్డాడు. తప్పు చేసిన దొంగ ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు దొరికిపోతాడు. ఈ కుర్రాడి విషయంలో కూడా అదే జరిగింది. దొంగ అయితే దొరికాడు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి.

 ముగ్గులోకి 14 మంది అమ్మాయిలను దింపిన రకీబ్

ముగ్గులోకి 14 మంది అమ్మాయిలను దింపిన రకీబ్

రకీబ్ అనే 18 ఏళ్ల కుర్రాడు ప్రేమయాణం సాగించాడు చివరకు తిప్పలు కొని తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే రకీబ్ మంచి ప్లే బోయ్. టైంపాస్‌ కోసం అమ్మాయిలకు వల వేస్తాడు. ఇతడు స్కెచ్ వేశాడంటే చాలు అమ్మాయిలు ఈ అందగాడి వెనక పడాల్సిందే. ఇలా ముందు ఒక అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా మరో అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఈ ఇద్దరికీ తెలియకుండా ఇంకో అమ్మాయికి లంగర్ వేశాడు. ఇలా ఒకరికొకరికి తెలియకుండా 14 మంది అమ్మాయిలను తన ప్రేమ వలలో పడేశాడు. పాపం అమ్మాయిలు కూడా ఇతని నమ్మారు.

 ఫిబ్రవరి 14న బయటపడిన గుట్టు

ఫిబ్రవరి 14న బయటపడిన గుట్టు

ఇక ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రానే వచ్చింది. ప్రేమికులంతా ఈ రోజును ఎంతో స్పెషల్‌గా భావిస్తారు. ఇక రకీబ్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా తన బాయ్ ఫ్రెండ్‌కు సర్పైజ్ ఇద్దామని నేరుగా రకీబ్ ఇంటికొచ్చారు. ముందుగా ఓ అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత మరో అమ్మాయి.. ఆ వెనకే ఇంకో అమ్మాయి.. ఇలా 14 మంది గోపికలు రకీబ్ ఇంటిముందు వాలిపోయారు. ఒకరినొకరు చూసుకుని షాక్‌కు గురయ్యారు. ఇంతకీ రకీబ్ ప్రేమించింది ఎవరినో తెలుసుకోలేక అయోమయానికి గురయ్యారు.

అమ్మాయిలందరిని ఒకేసారి చూడటంతో కోమాలోకి రకీబ్

అమ్మాయిలందరిని ఒకేసారి చూడటంతో కోమాలోకి రకీబ్

ఇక అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న రకీబ్ ఒక్కసారిగా కళ్లు తెరిచి చూసి షాక్‌కు గురయ్యాడు. తను ఐ లవ్ యూ చెప్పిన 14 మంది అమ్మాయిలను చూసి భయపడ్డాడు. అప్పటికే తను రహస్యంగా నెరిపిన ప్రేమయాణం గురించి బయటకు తెలిసి ఉంటుందని భావించి షాక్ అయ్యాడు. ఆ భయంతో ఏకంగా కోమాలోకి వెళ్లిపోయాడు లవర్ బాయ్. మిగతా 13 మంది అమ్మాయిలను చూసి షాక్ అయినట్లు తెలిపింది జోరినా అనే అమ్మాయి. అందరిని ఇలా మోసం చేయడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపింది. ఒకసారి అనుమానం వచ్చి రకీబ్ ఫోన్ చెక్ చేసినట్లు చెప్పిన జోరినా అందులో బేబీ గర్ల్ 1, 2,3...14 వరకు ఉన్న పేర్లతో మెసేజ్‌లు వచ్చాయని చెప్పింది. దీంతో ఈ మిగతా అమ్మాయిలను కూడా ఫిబ్రవరి 14కు అతని ఇంటికి రమ్మని చెప్పానని జోరినా వెల్లడించింది. దీంతో అబ్బాయి గారి గుట్టు రట్టయ్యింది.

రకీబ్ అయితే మోసం చేశాడు కానీ ... అమ్మాయిలైతే రకీబ్‌ను మాత్రమే ప్రేమించారు. రకీబ్ కోమాలోకి వెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేసిన వారు తను త్వరగా కోలుకుని మామూలు మనిషిగా రావాలని ఆకాంక్షించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rakib, an 18 year old was no less than a play boy and loved switching between his 14 girlfriends. Everything was going on well until 14th February showed up, The Valentine’s day. When he woke up in the morning, he saw all his girlfriends standing in front of him in his room.Seeing all of them he straight went into coma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more