లేఆఫ్ ఇచ్చేశారు..అమెరికా వెళ్లాలా, వద్దా? H-1B ఐటీ ఉద్యోగి ప్రశ్నకు షాకింగ్..!
గతేడాది అమెరికాలో ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసాలపై పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో హెచ్1బీ వీసాల వార్షిక ఫీజుల పెంపు, హెచ్1బీ వీసా ఇంటర్యూల వాయిదా, అలాగే వీసాల ఎంపిక కోసం లాటరీ విధానంలో మార్పులు వంటివి ఉన్నాయి. వీటి కారణంగా భారత్ కు వీసా ఇంటర్యూ కోసం వచ్చిన ఓ భారతీయ ఐటీ ఉద్యోగి ఇక్కడే ఉండగా.. అతనికి తన అమెరికన్ కంపెనీ లేఆఫ్ ఇచ్చేసింది. దీంతో అతను ఇప్పుడు తాను అమెరికాకు వెళ్లాలా వద్దా అని రెడ్డిట్ లో యూజర్లను సలహా అడిగాడు.ఈ ప్రశ్న కాస్తా వైరల్ కావడంతో షాకింగ్ రెస్పాన్స్ లు వస్తున్నాయి.
హెచ్1బీ వీసాపై కొనసాగుతూ భారత్ లో వర్క్ ఫ్రమ్ ఉద్యోగం చేసుకుంటున్న ఓ ఉద్యోగికి తాజాగా అతని కంపెనీ లేఆఫ్ ఇచ్చేసింది. దీంతో అతను తాను మళ్లీ అమెరికాకు వెళ్లగలనా లేదా అనే దానిపై సందేహం వచ్చింది. దీంతో అతను సోషల్ ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తూ సలహాలు కోరాడు. తనలాంటి పరిస్ధితులు ఎదుర్కొన్న ఉద్యోగులు ఎవరైనా ఉంటే తనకు దయచేసి ఓ మంచి సలహా ఇవ్వాలని కోరాడు.

"భారతదేశంలో ఉద్యోగం నుండి తొలగించబడిన తర్వాత నేను అమెరికాకు ప్రయాణించవచ్చా?" అనే శీర్షికతో అతను రెడ్డిట్ లో పెట్టిన పోస్టుకు భారీగానే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో యాక్టివ్ ఉద్యోగం లేకుండా అమెరికాలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించవద్దని చాలా మంది అతన్ని హెచ్చరించారు. చట్టబద్ధంగా చెప్పాలంటే, మీరు ఉద్యోగంలో లేనప్పుడు H-1Bపై అమెరికాకు ప్రయాణించకూడదని ఓ యూజర్ అతనికి సలహా ఇచ్చాడు.

మరికొందరు మాత్రం అమెరికాలో ఉన్న ఆస్తుల్ని అమ్మేసుకునేందుకు అయితే కోర్టులో అదే చెప్పి వెళ్లే అవకాశం ఉంటుందని సలహా ఇచ్చారు. అలాగే మరికొంతమంది యూజర్లు H-1B వీసాలతో తరచుగా లింక్ చేస్తున్న గ్రేస్ పీరియడ్ గురించి చెప్పారు. మీరు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి లేదా శాశ్వత నిష్క్రమణ కోసం సర్దుకునే ప్రక్రియ ప్రారంభించడానికి 60 లేదా 30 రోజుల విండో ఉన్నందున అమెరికా వెళ్లొచ్చని సూచిస్తున్నారు.
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications