H-1B Visa జారీ ఇకపై మరింత.. !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల వన్‌ టైమ్ H-1B వీసా ఫీజు వ్యవహారం భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అధిక ఛార్జీని చెల్లించడానికి ఇష్టపడక అనేక మధ్యస్థాయి కంపెనీలు, కన్సల్టెన్సీలు తమ ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేసుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలు స్టార్ట్ డేట్‌లను వాయిదా వేస్తున్నాయి. మరికొన్ని విదేశీ నియామకాలను పూర్తిగా నిలిపివేస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ H1B వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ.. ప్రత్యేకించి హెచ్ 1బీ వీసాల జారీలో చోటు చేసుకుంటోన్న అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ దేశాన్ని సుసంపన్నం చేసిన ఇమ్మిగ్రెంట్స్ కృషిని ప్రశంసించారు. H1B లబ్ధిదారులు అమెరికన్ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తేనే ఈ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

H-1B Scrutiny Intensifies as US Emphasizes American Identity and and national interest Says JD Vance

వైరెఫీ డాట్ కామ్, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమానికి జేడీ వాన్స్ హాజరయ్యారు. ఓపెన్ డిబేట్ ప్రోగ్రామ్ ఇది. ఈ సందర్బంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. H1-B వ్యవస్థలో అవకతవకలు జరుగుతున్నాయనే విషయాన్ని అంగీకరించారు. భారత్ కు చెందిన తన అత్తమామలను గుర్తు చేసుకున్నారు. అటువంటి వాళ్లు అమెరికాను సుసంపన్నం చేశారని ప్రశంసించారు.

తమ దేశానికి వలస వచ్చే పౌరులు తమ మూల ప్రాంతం గురించే కాకుండా ఆశ్రయం కల్పించిన దేశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని జేడీ వాన్స్ అన్నారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ తమను తాము అమెరికన్లుగా భావించినప్పుడే ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని తేల్చి చెప్పారు. భారతీయ నిపుణులు ఎందరో అమెరికాలో నివసించడానికి, ఇక్కడ పని చేయడానికి హెచ్ 1బీ వీసాలను ఉపయోగిస్తోన్నారని వ్యాఖ్యానించారు.

అక్రమ, చట్టబద్ధం కాని వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు చేపట్టారని, ఇందులో భాగంగానే హెచ్1 బీ వంటి వీసాలపై కఠినమైన ఆంక్షలను విధించారని అన్నారు. హెచ్ 1బీ వీసాల దుర్వినియోగాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా ట్రంప్ వర్ణించిన విషయాన్నిఈ సందర్భంగా జేడీ వాన్స్ గుర్తు చేశారు. లబ్ధిదారుల్లో 80 శాతం మందికి పైగా భారతీయులు, చైనా జాతీయులేనని కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+