H1B visa: భారతీయులకు గుడ్‌న్యూస్: ఇకపై అమెరికాలోనే వీసా రెన్యూవల్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు అగ్రదేశం తీపి కబురు చెప్పింది. యూఎస్ ప్రభుత్వం హెచ్1బీ వీసా (H1B Visa) రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొన్ని కేటగిరీల హెచ్1బీ వీసాలను.. అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ డిసెంబర్లో ఓ పైలట్ ప్రోగ్రామ్ (డొమెస్టిక్ వర్క్ వీసా రెన్యువల్) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
కాగా, డిసెంబర్లో ప్రారంభం కానున్న ఈ పైలట్ ప్రోగ్రామ్ 3 నెలలపాటు అందుబాటులో ఉంటుందని వీసా సర్వీసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ తెలిపారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద తొలత 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. కాగా, ఈ నిర్ణయం భారతీయులకు ఎంతో మేలు చేయనుంది.

భారత్లో H1B వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే భారతీయులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నామని జూలీ తెలిపారు. ఇందులో భాగంగానే.. అమెరికాలోనే H1B వీసా రెన్యువల్ చేసేందుకు ఒక పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నామన్నారు. డిసెంబర్ నుంచి 3 నెలలపాటు ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఈ క్రమంలో అమెరికాలో ఉన్న హెచ్1బీ వీసాదారులు తమ స్వదేశాలకు వెళ్లకుండానే.. తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. తొలుత ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద 20 వేల మందికి వీసాలు పునరుద్ధరిస్తామని.. ఇందులో మెజార్టీ భాగం భారతీయులే ఉంటారని భావిస్తున్నామని తెలిపారు.ఇక, ఈ వీసా రెన్యువల్ ప్రోగ్రామ్ను క్రమక్రమంగా విస్తరిస్తామని యూఎస్ వీసా సర్వీసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ వివరించారు. స్టూడెంట్ వీసాలు కూడా ఈ ఏడాది మరింత పెరగనున్నట్లు తెలిపారు. భారతీయులకు తక్కువ సమయంలోనే వీసాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.












Click it and Unblock the Notifications