ఆస్ట్రేలియాలోని ఓ సిటీ ప్రజలకు పెరిగే గడ్డితో చిక్కులు
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న చిన్న పట్టణం వరంగట్టా పెద్ద సమస్యను ఎదుర్కొంటింది. అది ఓ బూరు గడ్డి సమస్యను ఎదుర్కొంటోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ ఇళ్లను ముంచివేసే స్థాయిలో గడ్డి పెరుగుతుంది.
ఈ గడ్డి చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతి రోజు ఆ పట్ణాణాన్ని ఈ గడ్డి ముంచి వేస్తోంది. మనం పొద్దున్నే లేచి ఇంటి ముందు చెత్తను ఊడ్చేస్తాం. వరంగట్టా ప్రజలు ప్రతి రోజు తాము నిద్ర నుంచి లేచాక.. ఇంటి చుట్టూ పెరిగిన గడ్డిని కత్తిరించే పనిలో నిమగ్నమవుతారు.

వారు ఆ గడ్డిని కత్తిరించకుంటే ఏ వస్తువు ఎక్కడ ఉందో కనిపించే పరిస్థితి ఉండదు. ఈ గడ్డి తమను ఇబ్బందులకు గురి చేస్తోంది కాబట్టి ఆ గడ్డిని ఇక్కడి వారు 'హెయిర్ పానిక్' అని పిలుస్తారు. ఈ పట్టణంలో ప్రతి ఇంట్లోనూ ఈ గడ్డిని కత్తిరించేందుకు ప్రత్యేక మిషన్ ఉంటుంది. దాని సాయంతో కట్ చేస్తారు.












Click it and Unblock the Notifications