మక్కాలో నమ్మశక్యంకాని దృశ్యాలు: గొడుగులు, భౌతిక దూరం పాటిస్తూ యాత్రికులు

రియాద్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక కార్యక్రమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అనేక పండగలు, శుభ, ఇతర కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకునేలా, లేదా పరిమితంగా చేసుకునేలా చేసింది. ఇక ఈ ఏడాది మక్కా దర్శనంపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది.

సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం లేదని అక్కడ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా వెళ్లాలనుకునే మక్కాను.. ఈ ఏడాది పరిమిత సంఖ్యలోనే దర్శించుకుంటున్నారు.

 Hajj 2020: Championing social distancing, pilgrims offer prayers at Mecca in the Covid era.

హజ్ యాత్రకు కరోనా అడ్డంకిగా మారింది. ఈ ఏడాది మక్కా దర్శనానికి కేవలం సౌదీ అరేబియాలో ఉన్నవారిని మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తోంది. దీంతో దాదాపు ఏటా 2.5 మిలియన్ల మంది మక్కాను దర్శించుకుంటుండగా.. ఈ ఏడాది వీరి సంఖ్య కేవలం 10వేల మందికే పరిమితమైనట్లు అక్కడి మీడియా తెలిపింది.

కాగా, 10వేల మందిలో 50 మంది చొప్పునే కాబా దర్శనానికి అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా స్పష్టం చేసింది. అంతేగాక, మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. కాబా చుట్టూ తిరగేప్పుడు కూడా భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ప్రస్తుతం మక్కాలోని పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ రోజు మక్కాలో కనిపించిన నమ్మశక్యంకాని దృశ్యాలు.. కరోనా హజ్ యాత్రపై ఎంతటి ప్రభావం చూపిందో ఇవి చూస్తే తెలుస్తుందని హమ్మద్ అలీ హరిస్సి అనే వ్యక్తి ట్విట్టర్‌లో పలు ఫొటోలను పోస్టు చేశారు.

యాత్రికులు రంగు రంగుల గొడుగులు పట్టుకుని, భౌతిక దూరాన్ని పాటిస్తూ కాబా చుట్టూ తిరుగుతున్నారు. యాత్రికులను ఓ వైద్యుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. ప్రతి రోజూ మక్కాను శుభ్రం చేసేందుకు వేలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొంది. కాగా, కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్ర జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+