హమాస్ బిగ్ షాట్ అవుట్?

Israel: హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్‌ మరో పురోగతిని సాధించింది. హమాస్ సహ వ్యవస్థాపకుడు మఖమ్ మహ్మద్ ఇస్సా అల్- ఇస్సాను మట్టుబెట్టింది. శుక్రవారం గాజాపై నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆయన మరణించినట్లు వెల్లడించింది.

ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన హమాస్ శిబిరాలపై నిర్వహించిన మిస్సైళ్ల దాడుల సందర్భంగా మహ్మద్ హతమైనట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో హతమైంది మఖమ్ మహ్మదేనని నిర్ధారించుకున్నట్లు వివవరించింది.

Hamas Cofounder killed in Israel strikes

గాజా శివార్లలోని సబ్రాలో గల హమాస్ స్థావరాలపై వైమానిక దాడులను నిర్వహించింది ఇజ్రాయెల్. ఐడీఎఫ్- ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంయుక్తంగా వీటిని చేపట్టాయి. హమాస్ స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించాయి. ఈ సందర్భంగా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సహ వ్యవస్థాపకుడు మఖమ్ మహ్మద్ మరణించాడు.

2023 అక్టోబర్ 7వ తేదీన తమ దేశంపై హామాస్ నిర్వహించిన భయానక దాడులకు అతనే ప్రధాన సూత్రధారిగా భావిస్తోంది ఇజ్రాయెల్. అప్పటిదాడుల్లో 1,200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 250 మంది సరిహద్దు ప్రాంతాల ప్రజలను హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు.

ఇప్పటికీ 50 మందికి పైగా ఇజ్రాయెలీలు వారి చెరలో బందీలుగా ఉన్నారు. బందీల్లో 28 మంది మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాంటి దాడికి మాస్టర్ మైండ్ మహ్మద్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. మహ్మద్ ను హమాస్ లో మిగిలి ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్లల్లో ఒకడిగా పరిగణిస్తోంది ఇజ్రాయెల్.

గాజా స్ట్రిప్‌ లో హమాస్ సంస్థాగత నిర్మాణంలో ప్రధానంగా వ్యవహరించాడని, మిలటరీ వింగ్ కు నాయకత్వం వహించాడని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా- ఈ ఏడాదిన్నర కాలంలో గాజాపై సాగించిన దాడుల్లో హమాస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులను మట్టుబెట్టింది ఇజ్రాయెల్.

యాహ్యా సిన్వర్, ఆయన తమ్ముడు మహ్మద్ సిన్వర్, హసన్ నస్రల్లా, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+