చైనాలో భారీ వరదలకు 20 లక్షల మంది జీవితాలు అతలాకుతలం

చైనా

ఉత్తర చైనాలోని షాన్‌‌షీ ప్రావిన్స్‌‌లో వరదలు ముంచెత్తాయి. పదిహేడు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.

గత వారం కుండపోతగా కురిసిన వర్షాలకు అనేక భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. 70కు పైగా జిల్లాల్లో, నగరాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.

సుమారు మూడు నెలల క్రితం హెనన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా 300ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

పక్కనే ఉన్న హెబీ ప్రావిన్స్‌లో వరద నీటితో ఉప్పొంగుతున్న నదిలో ఒక బస్సు పడిపోయింది. ఈ దుర్ఘనటలో ముగ్గురు చనిపోయారని, బస్సులో ఉన్న 51మందిలో 11 మంది గల్లంతయ్యారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

అనేక పురాతన కట్టడాలకు షాంక్సి నిలయం. భారీ వర్షాలకు ఆ కట్టడాలన్నింటికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

1,20,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించారని, షాంక్సి ప్రావిన్స్ అంతటా 17,000 ఇళ్లు కూలిపోయాయని అధికారులు జిన్హువా వార్తా సంస్థకు తెలిపారు.

17వేల ఇళ్లు కూలిపోయాయని స్థానిక అధికారులు తెలిపారు

కొండచరియ విరిగిపడడంతో నలుగురు పోలీసు అధికారులు మరణించారని, హెనన్ వరదల కన్నా షాంక్సి వరదలు ఉధృతంగా ఉన్నాయని ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

షాంక్సి రాజధాని తైయువాన్‌లో గత వారం సగటున 185.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

"ఈ ఏడాది యెల్లో రివర్ మట్టం చాలా ఎక్కువగా ఉంది. వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు కూలిపోయాయి. అయితే, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు" అని యెల్లో నది ఒడ్డున ఉన్న నివసిస్తున్న ఓ మహిళ చెప్పారు.

షాంక్సి ప్రావిన్స్‌లో బొగ్గు ఉత్పత్తి అధికం. భారీ వర్షాల కారణంగా బొగ్గు గనుల్లో, రసాయన కర్మాగారాల్లో పనులు నిలిపివేయాల్సి వచ్చింది.

ఇప్పటికే, చైనాలో విద్యుత్ కొరత అధికంగా ఉంది. ఫలితంగా కోతలు పెరిగాయి. పోర్టులు, ఫ్యాక్టరీలలో విద్యుత్ వినియోగాన్ని అక్కడి ప్రభుత్వం పరిమితం చేసింది.

60 బొగ్గు గనుల్లో, 372 ఇతర గనుల్లో, 14 ప్రమాదకరమైన రసాయన కర్మాగారాల్లో ఉత్పత్తిని నిలిపివేశామని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.

అక్టోబర్ 4 నుంచి 27 ఇతర బొగ్గు గనుల్లో ఇప్పటికే పనులు నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+