జో బైడెన్ దిగి పోతూ.. పోతూ
Joe Biden: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఒక్కసారిగా అందరి దృష్టీ ఈ ఎన్నికలపై మళ్లేలా చేసింది.
జనవరి 20 నాటికి..
అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నవంబర్/ డిసెంబర్‌లల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. జనవరి 20వ తేదీన ఆ దేశ కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.

ట్రంప్ వర్సెస్..
2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. రిపబ్లికన్ల తరఫున కూడా అభ్యర్థి మారలేదు. ఆ ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
ట్రంప్ తడాఖా..
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనెటర్ జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరు ఖరారైంది. ఈ రెండు పార్టీలు కూడా విస్తృతంగా ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తోన్నాయి. ఇటీవలే విస్కాన్సిస్‌లోని మిల్వాకీలో నాలుగు రోజుల పాటు జాతీయ స్థాయి కన్వెన్షన్ సైతం నిర్వహించింది రిపబ్లికన్ పార్టీ.
ఊహించినట్టే..
ఈ పరిస్థితుల మధ్య.. జో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకోవడం ఖాయం అంటూ కొద్దిరోజుల నుంచే యూఎస్ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. చివరికి- అవి వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఊహించినట్టే స్వచ్ఛందంగా వైదొలిగారు.

బైెడెన్ స్థానంలో..
జో బైడెన్ స్థానంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బైడెన్ సహా పలువురు డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు ఆమె పేరును ఎండార్స్ చేశారు.
లిస్ట్ పెద్దదే..
కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించిన వారిలో మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ ఉన్నారు. 2015 నాటి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసి, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. వారిద్దరితో పాటు మసాచుసెట్స్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ ఉన్నారు.












Click it and Unblock the Notifications