వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగతనానికి వచ్చి స్ఫృహ కోల్పోయిన దొంగ, ఏం జరిగిందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో ఇద్దరు దొంగలు దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగతనానికి వచ్చిన దొంగల్లో ఒక దొంగ తన సహచరుడిపై పొరపాటున దాడి చేశాడు. దీంతో తన సహచరుడు స్పృహ తప్పిపోయాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చైనాలోని షాంఘైలో ఫిబ్రవరి 14న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు చోరికి వెళ్లారు. మాస్కులు ధరించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దొంగలు చోరీ యత్నం చేసే సమయంలో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి గాయపడతాడు. అయితే పోలీసుల దాడిలో మాత్రం దొంగ గాయపడలేదు. తన సహచరుడి వల్లే ఆ దొంగ గాయపడ్డాడు.

ఇద్దరు దొంగలు చోరీ కోసం వెళ్లి విఫలమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. . చివరికి నాటకీయ పరిస్థిత్తుల్లో దొంగలు అక్కడి నుంచి బయటపడ్డారు. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

గ్లాస్ డోర్‌ పగలకొట్టేందుకు తొలుత ఓ దొంగ ఇటుకలతో కొట్టాడు. చోరీకి వచ్చిన రెండో వ్యక్తి ఇటుకను తీసుకుని గ్లాస్ డోరు వైపు బలంగా విసరగా మొదటి దొంగకి గట్టిగా తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Hilarious robbery fail as thief knocks partner down unconscious

తన పొరపాటు గమనించిన రెండో వ్యక్తి తన పార్ట్‌నర్‌ను అక్కడినుంచి పక్కకు తీసుకెళ్లాడు. 'ఇలాంటి దొంగలున్నంత కాలం పోలీసులు ఓవర్ టైమ్ డ్యూటీ చేయాల్సిన పనిలేదంటూ' షాంఘై పోలీసులు కామెంట్ చేస్తూ సీసీటీవీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోను నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

English summary
Not all robberies are planned to the T, unlike what they show in movies such as the Italian Job or Ocean’s Eleven. While some end up being successful, which surely is not good for the person being robbed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X