వారానికి 40 గంటలే వర్క్: 1988 తర్వాత కార్మిక చట్టంలో అతిపెద్ద మార్పు!

ప్రపంచ వ్యాపంగా వర్క్ టైం తగ్గింపుపై పెద్ద ఉద్యమమే జరుగుతుంది. పెరుగుతున్న ఏఐ భారం, కొరవడుతున్న నైపుణ్యాల నేపథ్యంలో వర్క్ తో పాటు రోజుకో కొత్త స్కిల్ నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. దీంతో పాటుగా వర్క్ ప్లేస్ లో పెరుగుతున్న మెంటల్ టెన్షన్ కూడా మానసికంగా ఒత్తిడి పెంచుతున్నాయి. వెరసి కార్మిక లోకం నరకం చూస్తుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అంతర్జాతీయ కార్మిక లోకం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప ముందడుగు పడింది. లాటిన్ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో పనివేళలకు సంబంధించి సంచలన చట్ట సవరణ ఆమోదం పొందింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న గరిష్ట వారం పనివేళలను 44 గంటల నుంచి 40 గంటలకు తగ్గిస్తూ బ్రెజిల్ కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

అత్యంత విశేషమేమిటంటే.. పనివేళలు తగ్గినప్పటికీ కార్మికుల జీతాల్లో ఎటువంటి కోత ఉండదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉద్యోగులకు కచ్చితంగా వారానికి రెండు రోజుల సెలవు దొరికేలా భరోసా కల్పించారు. 1988 తర్వాత బ్రెజిల్ కార్మిక చరిత్రలో ఇతని పెద్ద మార్పు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Historic Labour Reform in Brazil Maximum Workweek Cut to 40 Hours for 30 Million Employees

3 కోట్ల మందికి పైగా కార్మికులకు ప్రత్యక్ష ప్రయోజనం

బ్రెజిల్ పార్లమెంట్‌లో ఈ బిల్లుకు అపూర్వ స్పందన లభించింది. దిగువ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు.. తాజాగా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఏకంగా 75-1 తేడాతో ఘన విజయం లభించింది. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3 కోట్ల మందికి పైగా కార్మికులకు, ముఖ్యంగా ఆరు రోజులు నిరంతరం కష్టపడే సాధారణ ఉద్యోగులకు ఊరట లభించనుంది.

ఒంటింటి పనులతో సతమతమయ్యే రియో డి జనీరోకు చెందిన ఒక సూపర్‌మార్కెట్ క్యాషియర్ లూసియానా డి అల్మేడా మాట్లాడుతూ.. తనకు ఒకే ఒక్క సెలవు దినం ఇంటి పనులకే సరిపోతోందని, ఈ కొత్త చట్టం వల్ల తన శారీరక, మానసిక అలసట తీరి పిల్లలతో గడిపే అవకాశం దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

నిరుద్యోగ భారతం: లేబర్ రిపోర్ట్‌లో బయటపడ్డ చేదు నిజాలు!
నిరుద్యోగ భారతం: లేబర్ రిపోర్ట్‌లో బయటపడ్డ చేదు నిజాలు!

తెరపైకి రాజకీయాలు.. ప్రెసిడెంట్ ఎన్నికల వేళ హాట్ టాపిక్

ఈ కార్మిక సంస్కరణ బ్రెజిల్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల రన్‌ఆఫ్‌కు ముందు ప్రధాన రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 25న జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, మితవాద అభ్యర్థి ఫ్లావియో బోల్సోనారో మధ్య గట్టి పోటీ నెలకొంది. తొలుత ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన బోల్సోనారో.. కార్మికుల్లో దీనికి ఉన్న అపారమైన ఆదరణను చూసి తన స్టాండ్ మార్చుకుని దీనికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే ఇది కేవలం రాజకీయ అవకాశవాదమేనని అధ్యక్షుడు లూలా విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ, కార్మికులకు కుటుంబంతో గడిపేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు ఈ చట్టం ఎంతో దోహదపడుతుందని లూలా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

చేతికి ఎక్కువ జీతం కావాలా? కొత్త లేబర్ కోడ్‌ల షాక్. పీఎఫ్ తగ్గిస్తే భారీ గండి
చేతికి ఎక్కువ జీతం కావాలా? కొత్త లేబర్ కోడ్‌ల షాక్. పీఎఫ్ తగ్గిస్తే భారీ గండి

దశలవారీగా అమలు.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న హర్షం

ఈ కొత్త పనివేళల నిబంధనను ఒక్కసారిగా కాకుండా దశలవారీగా అమలు చేయనున్నారు. తొలి రెండు నెలల ప్రాథమిక కాలం తర్వాత గరిష్ట పనివేళలను 42 గంటలకు తగ్గిస్తారు. ఆ తర్వాత కచ్చితంగా ఏడాది లోపు దీన్ని 40 గంటలకు కుదించనున్నారు. బ్రెజిల్‌లో నిర్వహించిన ఒక జాతీయ సర్వే ప్రకారం దాదాపు 70 శాతం మంది ప్రజలు ఈ తగ్గించిన పనివేళలు (shorter workweek) విధానానికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ సంస్కరణ ద్వారా ఉద్యోగుల పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరైన సమతుల్యత కుదురుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+