వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘హిట్లర్ ఆత్మహత్య చేసుకోలేదు.. భార్యతో పరారీ’

|
Google Oneindia TeluguNews

లండన్: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ అందరూ అనుకుంటున్నట్లుగా బెర్లిన్ బంకర్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోలేదట. హిట్లర్ తన భార్య ఈవా బ్రౌన్‌తో తప్పించుకు పారిపోయాడంటున్నారు లండన్‌కు చెందిన ఓ చరిత్రకారుడు.

హిట్లర్, ఆయన భార్యను నాజీలు జర్మనీ దాటించి.. ఆత్మహత్య చేసుకున్నాడనే అబద్ధంతో ప్రపంచాన్ని నమ్మించారని చరిత్రకారుడు గెరార్డ్ విలియమ్స్ చెబుతున్నారు.
రెండో ప్రపంచయుద్ధానికి మూలకారకుడైన హిట్లర్ ఆత్మహత్య చేసుకుంటే జర్మనీలోకి చొరబడిన రష్యన్ సైన్యాలు అతని శవం దొరికినట్టు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

Hitler did not commit suicide but escaped with wife: historian

హిట్లర్, అతని భార్య మృతదేహాలను బయటికి తీసుకురావడం చూసినట్లు రికార్డుల్లో నమోదు చేసిన ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలంలో ఉంది కానీ, తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టు ఎక్కడా లేదని ఆయన వాదిస్తున్నారు. అవి నియంత దంపతుల డూప్‌లవని చెప్పారు.

ఏప్రిల్ 1945లో అసలు హిట్లర్, ఆయన భార్య బంకర్ నుంచి పరారయ్యారని విలియమ్స్ చెప్పారు. శనివారం టెలివిజన్‌లో ప్రసారమయ్యే గెరార్డ్ విలియమ్స్ ఇంటర్వ్యూలో అతిక్రూర నియంత హిట్లర్ మరణంపై మరిన్ని సంచలనాత్మక వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

హిట్లర్ దాచిన గుప్త నిధులు

రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిట్లర్ దాచిన 50మిలియన్ పౌండ్ల నిధిని కనుగొన్నట్టు ఒక డచ్ వ్యక్తి ప్రకటించాడు. యుద్ధసమయంలో రాసుకున్న మార్ష్ ఇంప్రాంప్టు అనే సంగీతపు నోట్‌లోని కోడ్‌ను రెండేళ్లు కష్టపడి ఛేదించి ఆ గుప్తనిధి ఉన్న స్థలాన్ని కనిపెట్టినట్టు సిరిల్ విజ్లర్ అనే వయోలిన్ తయారీదారుడు చెప్పారు.

అందులోని అక్షరాలు, అంకెలు, చిహ్నాలు నిధికి వెళ్లే మార్గాన్ని సూచిస్తున్నాయని తను ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించగలనని విజ్లర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మిట్టెన్‌వాల్డ్ అనే ప్రాంతంలోని ఆయుధ డిపో వెనుక హిట్లర్ 100 బంగారంకడ్డీలు, మరెన్నో విలువైన వజ్రాలను పాతిపెట్టినట్టు తెలిపారు.

English summary
Adolf Hitler did not commit suicide at the end of the second world war but was spirited out of Germany by the Nazis in a massive cover up to make the world fall a victim to "duplicitous deception," a noted British historian has claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X