డొనాల్డ్ ట్రంప్ డేటింగ్ ఆఫర్.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ బ్యూటీ !

ఓ వైపు టారిఫ్‌లు, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈసారి మాత్రం డేటింగ్ ఆఫర్ తో బుక్కయ్యారు. హాలీవుడ్ నటి ఎమ్మా థాంప్సన్ ఆయన గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎమ్మా థాంప్సన్, ఆగస్టు 8న స్విట్జర్లాండ్‌లో జరిగిన లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ వేడుకలో ఆమెను కెరీర్ లో సాధించిన విజయాలకు గాను లెపర్డ్‌ క్లబ్‌ అవార్డు‌తో సత్కరించారు. అవార్డు స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఒక షాకింగ్ సంఘటనను గుర్తు చేసుకున్నారు. తన భర్త, నటుడు కెన్నెత్ బ్రానాగ్‌తో విడాకులు తీసుకున్న రోజు.. తాను ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా ఫోన్ మోగిందని చెప్పారు.

hollywood-actress-emma-thompsons-comments-about-trump-dating-offer

డేటింగ్ ఆఫర్..

కాల్ లిఫ్ట్ చేయగానే, అవతలి వైపు నుంచి "హలో, నేను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాను" అని వినిపించిందని, మొదట ఇది సరదా పంచ్‌ అనుకున్నానని తెలిపారు. తరువాత ట్రంప్, తనకు చెందిన "అత్యంత అందమైన ప్రదేశాలలో" ఒకదానిలో బస చేసేందుకు ఆహ్వానిస్తూ, డిన్నర్ కూడా కలిసి చేద్దామని ప్రతిపాదించారట.

ఆ ఆహ్వానానికి ఎమ్మా, "చాలా బాగుంది, ధన్యవాదాలు, మళ్లీ మాట్లాడుకుందాం" అని మర్యాదపూర్వకంగా సమాధానమిచ్చారని చెప్పారు. అయితే ఆ సమయంలోనే ఈ కాల్ నిజంగా ట్రంప్ నుంచే వచ్చినట్టు తెలుసుకున్నారని పేర్కొన్నారు.

hollywood-actress-emma-thompsons-comments-about-trump-dating-offer

అంతే కాకుండా సరదాగా మాట్లాడుతూ.. ఆ సమయంలో నేను ఆ ఆహ్వానాన్ని అంగీకరించి ఉంటే, బహుశా అమెరికా చరిత్ర దశే మారి ఉండేదన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+