Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మానవ పూర్వీకుల్లో సరికొత్త జాతి.. హోమో నలేది: కీలక మైలురాయి

జోహన్నస్ బర్గ్: మానవ కుటుంబ వృక్షానికి చెందిన మరొక కొత్త జాతి వెలుగు చూసింది. చిన్నపాటి మెదడు కలిగిన ఈ జీవి శిలాజాలు దక్షిణాఫ్రికాలోని ఓ గుహలో వెలుగుచూశాయి. ఇది మానవజాతి ఆవిర్భావ తీరు గురించి ఆసక్తికర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మానవ పరిణామక్రమ పరిశోధనలో ఇది కీలక మైలురాయిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో మానవజాతి ఊయలగా పేర్కొనే రైజింగ్ స్టార్ గుహలో ఈ శిలాజాలు లభించాయి. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశం.

గుహలోని లోతైన నేలమాళిగలో ఉన్న ఒక గదిలో వీటిని విట్ వాటర్స్ రాండ్ వర్సిటీకి చెందిన లీ బర్జర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం 2013లో తొలిసారి కనుగొంది. తాజాగ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ కొత్త జాతికి హోమో నలేడిగా పేరు పెట్టారు.

 Homo naledi: new species of ancient human discovered, claim scientists

శిలాజాలు వెలుగు చూసిన నలెడి గుహ పేరునే దానికి ఖరారు చేశారు. స్థానిక భాష సెసోథోలో నలేడి అంటే నక్షత్రం. 1920ల నుంచి మానవ శిలాజాలు అనేకం ఈ ప్రదేశంలో నెలలుగు చూశాయి.

రైజింగ్ స్టార్ గుహలో మొత్తం 15 రకాల జంతువులకు చెందిన అవశేషాలు లభ్యమయ్యాయి. అందులో 1500 ఎముకలు ఉన్నాయి. ఈ అవశేషాలు మానవులకు దగ్గరగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ జీవులకు మనుషుల్లాగే తల, మెదడు ఉందని గుర్తించారు. చెట్లు ఎక్కేందుకు వీలుగా వీటికి చేతి వేళ్లు కూడా ఉన్నాయని వారు వెల్లడించారు. ఈ కొత్త జాతికే హోమో నలేది అనే పేరు పెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+