లీటర్ పెట్రోల్ రూ. 400.. పక్క దేశంలోకి వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్న ప్రజలు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. 38 రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు చేస్తోంది. అంతే కసిగా ఇరాన్ జవాబిస్తోంది. ఓ వైపు సంధి చర్చలు చేపడుతూనే మరోవైపు భీకర దాడుల్ని కొనసాగిస్తున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోయాయి. దాదాపు అన్ని దేశాల్లో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న సంపన్న దేశాలే ఈ పరిస్థితుల్ని తట్టుకోలేక పోతున్నాయి.

ఇక పేద, మధ్యతరగతి దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. చమురు సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్తే జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పుడు హాంకాంగ్ పరిస్థితి ఇలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఇక్కడ పెట్రోల్ రేటు ఉంది. హాంకాంగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 383 గా ఉంది. త్వరలోనే రూ. 400 కు చేరువలో ఉంది. దీంతో అక్కడి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ దేశంలో పెట్రోల్ ధర గ్యాలన్ రూ.1300 లకు పైగానే ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం.

ఇక హాంకాంగ్ లో సొంత వాహనాలు ఉన్నవారు మొత్తం జనాభాలో 8 శాతమే అయినప్పటికీ చమురు సంక్షోభం కారణంగా ఆ దేశంలో రవాణా, లాజిస్టిక్స్ విభాగాలు పూర్తిగా స్తంభించాయి. దాంతో రానున్న రోజుల్లో హాంకాంగ్ లో నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం రావొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి హాంకాంగ్ లో ఎప్పుడూ పెట్రోల్ రేట్లు అధికంగానే ఉంటాయి. కారణం.. అక్కడ అధిక పన్నులు, భూముల ధరలు పెరగడం.. అయితే ఈసారి ఇరాన్ యుద్ధంతో ఆ రేట్లు మరింతగా పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

HongKong Petrol Price Nears 400 per Liter Due to Oil Crisis Citizens Refuel in China petrol price

అయితే హాంకాంగ్ లో అధిక పెట్రోల్ ధరల కారణంగా అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. సరిహద్దు దేశం అయిన చైనాకు వెళ్లి పెట్రోల్ పోయించుకుంటున్నారు. హాంకాంగ్ తో పోల్చితే చైనాలో పెట్రోల్ ధర మూడో వంతు తక్కువగా ఉండటం గమనార్హం. అయితే హాంకాంగ్ కు అవసరమైన చమురులో దాదాపు 80 శాతం చైనా నుంచే సరఫరా అవుతుంది. దాంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చమురు సరఫరా కొనసాగుతోందని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+