ఒక్క హగ్ కు రూ.600.. చైనాలో కొత్త ట్రెండ్.. కుర్రాళ్లకు ఫుల్ గిరాకీ
కొత్త పరికరాలను సృష్టించాలన్నా.. కొత్త వైరస్ లను పుట్టించాలన్నా.. కొత్త ట్రెండ్స్ తీసుకురావాలన్నా అది చైనాకే సాథ్యం. మారుతున్న జీవనశైలి.. ఉరుకులు పరుగుల జీవితం దృష్ట్యా ప్రేమ, కరుణ, ఆదరణ, ఆప్యాయతలకు ప్రజలు దూరం అవుతున్నారు. నా అనే వాళ్లు లేక కొంతమంది.. అందరూ ఉన్నా ఒంటరిగా జీవిస్తున్నా మరికొంతమంది కోసం అక్కడ ఓ ట్రెండ్ పుట్టింది. దాని పేరే "మ్యాన్ మమ్స్ " ఇప్పుడీ ట్రెండ్ చైనా వ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడుకున్న జీవితం దృష్ట్యా చైనాలో ఓ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది అదే "మ్యాన్ మమ్స్ " ఈ ట్రెండ్ ప్రకారం.. అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 600 చెల్లిస్తారు అమ్మాయిలు. దీంతో చైనాలోని కుర్రాళ్లకు ఫుల్ గిరాకీ అని చెప్పొచ్చు. సాధారణంగా అమ్మాయిలకు నగదు చెల్లిస్తారు. కానీ ఈ ట్రెండ్ ప్రకారం అమ్మాయిలే అబ్బాయిలకు చెల్లిస్తారు. దీంతో చైనా వ్యాప్తంగా ఈ ట్రెండ్ వైరల్ అవుతోంది.

ఎవరైనా అబ్బాయిలు.. ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 200 నుంచి రూ. 600 వరకు పే చేస్తున్నారు. ఆన్ లైన్ లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు.. నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో హగ్స్ కానిస్తారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications