టోర్నడోల బీభత్సం: 100 మంది మృతి.. గిడ్డంగిలో చిక్కుకున్న 100 మంది
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి.. కెంటకీ రాష్ట్రంలో వంద మంది చనిపోయారు. టోర్నడోల వల్ల వేలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు దెబ్బతిన్నాయి. కెంటకీ చరిత్రలో అత్యంత దుర్భర దినం అని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఓ క్యాండిల్ ఫ్యాక్టరీలో పైకప్పు కుప్పకూలటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు చెప్పారు. పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు..

ప్రకృతి కన్నెర్ర
అమెరికా ఈశాన్య రాష్ట్రాలపై ప్రకృతి పగపట్టింది.. కెంటకీ, ఆర్కాన్సాస్, టెన్నెస్సీ, మిస్సోరి, ఇల్లినాయిస్ రాష్ట్రాలపై టోర్నడోలు విరుచుకుపడ్డాయి. కెంటకీలో భారీ విధ్వసం సృష్టించాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు పెద్ద సంఖ్యలో నేలకూలాయి.. వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.. ఎక్కడ చూసిన బీభత్స వాతావరణం కనిపించింది..

అపార నష్టం
టోర్నడోల ధాటికి కెంటకీలోని గ్రేవ్స్ కౌంటీలో అపారనష్టం జరిగింది.. మేఫీల్డ్ ప్రాంతంలోని క్యాండిల్ ఫ్యాక్టరీ తీవ్రంగా దెబ్బతింది.. ఆ సమయంలో అందులో 100 మంది వరకూ ఉన్నారని సమాచారం. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 50 వేల మంది ప్రజలు చిమ్మ చీకట్లో కాలం గడుపుతున్నారు. కెంటకీలో సహాయ చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శిథిలాల తొలగింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరారు.

పట్టాలు తప్పిన రైలు
హాప్‌కిన్స్ కౌంటీలో వీచిన గాలుల తీవ్రతకు రైలు పట్టాలు తప్పింది.. దీంతో ఈ టోర్నడోల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇల్లినాయ్‌లో అమెజాన్ గోడౌన్ కూడా టోర్నడోల ధాటికి ధ్వంసం అయ్యింది. గోడౌన్‌లో చిక్కుకున్న వాళ్లను సహాయక సిబ్బంది కాపాడారు. 100 మంది వరకు సిబ్బంది అమెజాన్ గోడౌన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నడోలపై అమెరికా వాతావరణ శాఖ కెంటకీ, ఆర్కాన్సాస్, టెన్నెస్సీ, మిస్సోరి, ఇల్లినాయిస్ రాష్ట్రాలను ముందుగా

గతంలో ఎన్నడూ లేదు
కెంటనీ చరిత్రలో అత్యంత తీవ్రమైనదిగా ఆ రాష్ట్ర గవర్నర్ అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యల కోసం సిబ్బంది రంగంలోకి దిగారు. కెంటకీలో సుమారు 180 మంది సహాయక చర్యలను చేపడుతున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications