వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న పెను తుఫాను డోరియన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hurricane Dorian Is Juicing Up To Hit Florida With Extreme Floods

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హరికేన్ డోరియన్ అట్లాంటిక్ సముద్ర తీరం మీదుగా ఫ్లోరిడా వైపు దూసుకెళ్లింది. ఇక డోరియన్ తుఫాను ధాటికి ఫ్లోరిడాలో పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. డోరియన్ తుఫాన్ బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉండటంతో అక్కడికి వచ్చిన పర్యాటకులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది స్థానిక ప్రభుత్వం. డోరియన్ తుఫాను పెను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తుఫాను ధాటికి పలు పర్యాటక ప్రాంతాలు ధ్వంసం అవడమే కాకుండా... వాల్ట్ డిస్నీ వరల్డ్, నాసా లాంచ్ ప్యాడ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన పామ్‌ బీచ్‌లోని రిసార్ట్ కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది.

డోరియన్ తుఫాను కారణంగా బీభత్సమైన గాలులు వీచే అవకాశం ఉందని మియామీ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. అయితే వచ్చే వారంలో ఇది మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. అత్యవసర వస్తువులను ప్యాక్ చేసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కొన్ని గ్యాస్ స్టేషన్‌లో ఇంధనం కొరత కూడా ఏర్పడింది. హరికేన్ డోరియన్ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడి నగరవాసులు ఫ్లాష్ లైట్లు, బ్యాటరీలు, జనరేటర్లను కొనుగోలు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

Hurricane Dorian to strike Florida, wind speed at 225kmph

ఇక బహామాస్‌లో డోరియన్ తుఫాను ఇప్పటికే బీభత్సం సృష్టిస్తుండటంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సముద్రంలో అలలు 3 నుంచి 4.5 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం డోరియన్ తుఫాను క్రమంగా ఫ్లోరిడా వైపు దూసుకెళుతోందని అధికారులు తెలిపారు. అయితే ఫ్లోరిడా రాష్ట్రంలో కచ్చితంగా ఎక్కడ బీభత్సం సృష్టిస్తుందో అనేదానిపై స్పష్టత లేదని చెప్పారు వాతావరణశాఖ అధికారులు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 140 మైళ్ల వేగంతో గాలి వీస్తుందని ఆ సమయంలో ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా వైపు వస్తున్న డోరియన్ తుఫాను పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిని బట్టి ఫ్లోరిడా వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలా వద్దా అన్నది ఆదివారం నిర్ణయిస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ వాతావరణ అధికారులు మాత్రం డోరియన్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.

English summary
U.S. President Donald Trump said on Friday the decision whether to order some residents of Florida to evacuate likely would be made on Sunday as the state braces for Hurricane Dorian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X