ఉగ్రరూపం దాల్చిన ‘హారికేన్ ఇర్మా’, భూకంపం వచ్చే ప్రమాదం?

అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘హారికేన్ ఇర్మా’ రోజురోజుకూ బలపడుతోంది. మంగళవారం 5వ ప్రమాద స్థాయి తీవ్రత గల హారికేన్‌గా మారింది. సముద్రంలో భారీ అలల ప్రభావానికి భూకంపం వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.

ఫ్లోరిడా: అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'హారికేన్ ఇర్మా' రోజురోజుకూ బలపడుతోంది. మంగళవారం 5వ ప్రమాద స్థాయి తీవ్రత గల హారికేన్‌గా మారింది. దీంతో తీరం దాటే సమయంలో భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

గంటకు 185 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బలమైన గాలులు, సముద్రంలో భారీ అలల ప్రభావానికి భూకంపం వచ్చే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. భూకంప హెచ్చరికల పరికరాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

hurricane-irma

ఫ్లోరిడా, జార్జియా లేదా కరోలినాలో ఈ హారికేన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఫ్లోరిడా, ప్యూర్టోరికో, యూఎస్ విర్జిన్ ద్వీపాలలో అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో హారికేన్ ప్రభావం చూపనున్న ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి.

ప్రజలు ఎక్కువగా ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు. బుధవారం నుంచి ఈ హారికేన్ ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+