భారత్‌లో ఎన్నికల వ్యవస్థ ఎలాంటిదో వెల్లడించిన ట్రంప్: అందుకే నిధులు కట్: వేరొకరు ఎన్నిక
Donald Trump: భారత్ సహా వివిధ దేశాలకు అమెరికా చేస్తోన్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ఫ్లోరిడాలోని మియామిలో ఏర్పాటైన ఎఫ్ఐఐ ప్రయారిటీ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఎన్నికల వ్యవస్థ గురించీ ప్రస్తావించారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై..
ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు మొన్నటివరకు 21 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ తాజాగా దీన్ని నిలిపివేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పైనా సంతకం చేశారు. భారత్ సహా మొజాంబిక్ 10 మిలియన్ డాలర్లు, కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద 12 మిలియన్ డాలర్లు, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్- 32, సెర్బియా- 486, మొల్డొవా- 22, భారత్- 21, బంగ్లాదేశ్- 19, లైబీరియా- 1.5, నేపాల్- 19, మాలీ- 14 మిలియన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులనూ రద్దు చేశారు.

మేమెందుకు డబ్బులివ్వాలి..
దీన్ని సమర్థించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌కు తామెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. భారత్‌ను అత్యధిక పన్నులు విధించే దేశంగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యధిక పన్నులను విధించే దేశాల్లో భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యానించారు.
24 గంటల్లో..
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టిన 24 గంటల వ్యవధిలో మరోసారి ఓటర్స్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఎఫ్ఐఐ ప్రయారిటీ సదస్సులో మాట్లాడారు. 21 మిలియన్ డాలర్లంటే చిన్న మొత్తం కాదని, అంత డబ్బును తామెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు.
#WATCH | Miami, Florida | Addressing the FII PRIORITY Summit, US President Donald Trump says, "... Why do we need to spend million on voter turnout in India? I guess they were trying to get somebody else elected. We have got to tell the Indian Government... This is a total… pic.twitter.com/oxmk6268oW
— ANI (@ANI) February 20, 2025
వేరొకరిని ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తున్నారు..
భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచుకోవడానికి అమెరికా 21 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. అక్కడి ఓటర్లు వేరొకరిని ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు ట్రంప్. తాము పంపించిన ఈ నిధులను ఒక నిర్దుష్ట అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికలను మళ్లించడానికి వినియోగించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications