నేను చేసిన నేరం అదొక్కటే- అరెస్ట్ తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగం

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 2016 హుష్ మనీ చెల్లింపుల కేసుల్లో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. నేరారోపణలతో అరెస్టయిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే. అమెరికా చరిత్రలో ఇదొక అసాధారణ ఘట్టం. 2024లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయడానికి సన్నద్ధమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.

2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. దీనికోసం తన తరఫు అడ్వొకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తం డబ్బులను చెల్లించారనేది ట్రంప్‌పై ఉన్న ఆరోపణలు. ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును విచారించిన మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది.

Donald Trump in his first public remarks

విచారణ ముగిసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తన నివాసం నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికాను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వారి నుంచి ఈ దేశాన్ని కాపాడటానికి నిర్భయంగా ప్రయత్నించానని, తాను చేసిన నేరం అదొక్కటేనని వ్యాఖ్యానించారు. అందుకు తాను గర్వపడతున్నానని చెప్పారు.

ప్రస్తుత డెమొక్రాట్ల ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న జో బైడెెన్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. అమెరికా నరకంలోకి వెళ్లబోతోంది..ఈ దేశాన్ని కాపాడుకోండి అని హెచ్చరించారు. అమెరికాలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని తాను ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్‌ను చూసి, ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికాను చూసి నవ్వుకుంటోన్నాయని ఆరోపించారు.

అయిదు మంది చెత్త అధ్యక్షుల పేర్లను పరిగణనలోకి తీసుకుంటే అందులో జో బైడెన్ పేరు ఖచ్చితంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బైడెన్.. అమెరికాను తిరోగమనం వైపు నడిపిస్తోన్నారని, మనది విఫలమని భావోద్వేగంతో చెప్పారు. తనపై నేరారోపణలు చేయడం, వాటిని నిరూపించడానికి రాడికల్ లెఫ్ట్ ప్రాసిక్యూటర్లు అమెరికా వ్యాప్తంగా ఉన్నారని, ఏ ధరకైనా అమ్ముడుపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారంటూ మండిపడ్డారు ట్రంప్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+