సిగ్గుపడుతున్నా, క్షమించండి: డా. అంజలి(వీడియో)

ఫ్లోరిడా: అమెరికాలోని మియామిలో మద్యం మత్తులో ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన భారత సంతతికి మహిళా డాక్టర్ అంజలి రామకి సూన్(30) క్షమాపణ కోరింది. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌పై ఆమె దాడి చేసిన వీడియో ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఆమె ఘటనపై వివరణ ఇచ్చింది. తాను చేసిన దానికి సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలని కోరింది.

డాక్టర్ అంజలి రాంకిసూన్ మియామీలో ప్రజా వైద్యశాల అయిన జాక్సన్ హెల్త్ సిస్టంలో రెసిడెంట్ ఎంప్లాయిగా నాలుగేళ్లుగా పనిచేస్తోంది. వారం క్రితం మద్యం మత్తులో ఆమె ఉబెర్ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసింది. అతడు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయింది. విచక్షణారహితంగా బాదేసింది.

తర్వాత కారులోకి ఎక్కి పేపర్లు, ఇతర వస్తువులు బయటకు విసిరేసింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆమె తప్పు ఒప్పుకుంది. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ఏబీసీ న్యూస్‌తో చెప్పింది.

ఈ ఘటనతో తాను చాలా మందిని బాధ పెట్టానని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కుంగుబాటు కారణంగానే అలా ప్రవర్తించానని, తన జీవితంలోనే అది దుర్దినమని పేర్కొంది. దాడి జరిగిన రోజున తన తండ్రి ఆస్పత్రి పాలయ్యారని, తన ప్రియుడి నుంచి విడిపోయానని వెల్లడించింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం శ్రేయస్కరం కాదని భావించి తన కారును అక్కడే వదిలేశానని తెలిపింది.

అదే సమయంలో ఉబర్ క్యాబ్ రావడంతో ఈ ఉదంతం చోటు చేసుకుందని వివరించింది. కాగా, ఉబర్ క్యాబ్‌ను పిలిచిన మరో ప్రయాణికుడు అక్కడ జరిగిందంతా సెల్‌ఫోన్‌తో వీడియో తీసి యూట్యాబ్‌లో పెట్టాడు.

ఈ వీడియోతో తన కుటుంబ పరువు తీసిందని రామకి సూన్ వాపోయింది. జరిగిన దానికి తనదే బాధ్యత అని, తనను మన్నించాలని వేడుకుంది. కాగా, ఆమెను వైద్య విధుల నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్ తొలగించి సెలవుపై పంపివేసింది. అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+