యూఎస్ కేబినెట్‌లో ఎలాన్ మస్క్- కీలక శాఖ: జరిగేది ఇదే
US President Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోయే ఆ ఎన్నికల కోసం అధికార డెమొక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ జోరుగా ర్యాలీలను నిర్వహిస్తోన్నాయి. డిబేట్లకు సమాయత్తమౌతోన్నాయి.
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్షురాలు పోటీలో ఉన్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగారు. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారాయన. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో పరాజయం పాలయ్యారు. మూడోసారి బరిలో దిగారు.

తాజాగా- ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ది ఎకనమిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌తో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక రంగానికి సంబంధించి క్లబ్ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. ఆర్థిక సంస్కరణలకు తెర తీస్తానని పేర్కొన్నారు.
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తానని, దీనికోసం సరికొత్త సంస్కరణలను అమలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై సమగ్రంగా ఆడిట్ నిర్వహిస్తానని, దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నానని అన్నారు.
సంస్కరణల కోసం ప్రత్యేకంగా ఓ ఎఫీషియన్సీ కమిషన్ టాస్క్‌ను ఏర్పాటు చేస్తానని, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌ను దీనికి అధినేతగా నియమిస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదనీ అన్నారు.
ఎఫీషియన్సీ కమిషన్ టాస్క్ చీఫ్‌గా వ్యవహరించడానికి ఎలాన్ మస్క్ కూడా అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫైనాన్స్ టాస్క్ ఫోర్స్ అవసరమని అన్నారు.
తాను అధికారంలోకి వచ్చిన తరువాత తక్కువ ట్యాక్సులు- వడ్డీ రేట్లు, సరిహద్దుల భద్రత, నేరాల రేటును సున్నా స్థాయికి తీసుకుని రావడం, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్లు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. స్నేహపూరక విదేశాంగ విధానాన్ని అమలు చేస్తానని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications