Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇమ్రాన్ ఖాన్ గాలి తీసేసిన మాజీ భార్య: ఆయన తోలుబొమ్మతో సమానమట

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ భార్య రేహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భర్త, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోలుబొమ్మతో సమానమని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరని చెప్పారు. చివరికి- ఏమి మాట్లాడాలనేది కూడా మిలటరీ చెబుతుందని అన్నారు. మిలటరీ అధికారులు రాసిచ్చే స్క్రిప్ట్ ను ఇమ్రాన్ ఖాన్ చదువుతారని చురకలు అంటించారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతీపుర వద్ద ఉగ్రవాదుల దాడి ఘటనపై ప్రకటన చేయడానికి మిలటరీ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఇమ్రాన్ ఖాన్ ఎదురు చూశారని రేహమ్ ఖాన్ ఎత్తిపొడిచారు.

ఇమ్రాన్ ఖాన్ అంతకుముందులా లేరని, అధికారంలోకి రావడానికి తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారని అన్నారు. సిద్దాంతాలతో రాజీపడి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఏం మాట్లాడాలన్నా మిలటరీ అధికారుల వైపు చూస్తారని చెప్పారు. భారత్ యుద్ధాన్ని ప్రకటిస్తే.. పాకిస్తాన్ చూస్తూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? చూస్తూ ఊరుకోదు. తాను ప్రతీకార దాడులకు సిద్ధపడుతుంది. ప్రతీకార దాడులు చేయడానికి మించి మరో ప్రత్యామ్నాయం పాకిస్తాన్ ముందు లేదు. యుద్ధం ప్రారంభించడం వరకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అదెక్కడ ఆగుతుందనేది ఎవరి చేతుల్లో లేదు. యుద్ధం ఎప్పుడు ఆగుతుందనే విషయం దేవుడికి మాత్రమే తెలుసు.. అని వ్యాఖ్యానించారు.

Imran Khan puppet of military, was waiting for instructions before speech: Ex-wife Reham Khan

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారని కాదు గానీ.. పాకిస్తాన్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునైనా సరే.. ఉగ్రవాదంపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రేహమ్ ఖాన్ అన్నారు. కొన్ని ఉగ్రవాద సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి చాన్నాళ్ల కిందటే చర్యలు ఆరంభమైనప్పటికీ.. అవి పూర్తి కావట్లేదని చెప్పారు. జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాకిస్తాన్ కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని, అయినప్పటికీ.. అలాంటి గ్రూపులను మట్టుబెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది మాత్రం నిజం అని అన్నారు.

పుల్వామా దాడిపై తొలిసారిగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాన్ని తాను విన్నానని అన్నారు. ఇది అచ్చంగా ఆయన ప్రసంగమేనని తాను అనుకోవట్లేదని చెప్పారు. ఇమ్రాన్ ప్రసంగం వెనుక కొన్ని శక్తులు ఉండి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ పౌరురాలైన రెహామ్ ఖాన్ గతంలో పాత్రికేయురాలిగా పనిచేశారు. 2015లో ఇమ్రాన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న పది నెలలకే అతని నుంచి విడాకులు తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+