బెదిరింపులు: పాక్‌ను వదిలివెళ్లిన ఇమ్రాన్ మాజీ భార్య రెహమ్, బయోగ్రఫీనే కారణమా?
ఇస్లామాబాద్: తీవ్రమైన బెదిరింపులు వస్తుండటంతో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ గత ఆదివారం రాత్రి పాకిస్థాన్ వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. పాకిస్థాన్ న్యూస్ ఛానళ్లు కూడా ఈ విషయం ధృవీకరించడం గమనార్హం.
బ్రిటీష్ పాకిస్థాన్ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్.. ఈ బెదిరింపుల నేపథ్యంలో తన కూతురును ఇక్కడ చదివించలేనని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్‌లోని ఏ రాజకీయ పార్టీ కూడా తనకు అండగా ఉండలేదని ఆమె వాపోయారు.

రాజకీయ జోక్యమే కారణమా?
44ఏళ్ల రెహమ్ ఖాన్ పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న కారణంగానే రాజకీయ నేతగా మారిన పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆమె నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బ్రిటన్‌కు చెందిన జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్.. ఆమెకు 2004లో విడాకులిచ్చారు. ఆ తర్వాత రెహమ్ ఖాన్‌ను వివాహంచేసుకున్న విషయం తెలిసిందే.

బయోగ్రఫీ వల్లే బెదిరింపులా?
కాగా, రెహమ్ ఖాన్ బయోగ్రఫీకి సంబంధించిన పుస్తకం ఒకటి తాజాగా విడుదల కావాల్సి ఉంది. ఈ పుస్తకంలో ఇమ్రాన్ ఖాన్‌తో తన వివాహం, వివాదాల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది.

రెహమ్ బయోగ్రఫీలో..
ఇటీవల జియో టీవీతో రెహమ్ ఖాన్ మాట్లాడుతూ.. తన జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయని, ఇమ్రాన్ ఖాన్‌తో వివాహం, విడిపోవడానికి గల కారణాలు, తదితర అంశఆలు ఇందులో పేర్కొనడం జరిగిందని చెప్పారు. అయితే, తన పుస్తకం ఎవరి కోపంతోనే, ద్వేషంతోనే రాయడం జరగలేదని స్పష్టం చేశారు.

ఏ పార్టీతోనూ సంబంధం లేదు
అంతేగాక, తాను పాకిస్థాన్‌లోని ఏ పార్టీకి కూడా మద్దతు తెలపలేదని రెహమ్ ఖాన్ తెలిపారు. అలాగే తనకు కూడా ఏ పార్టీ నుంచి మద్దతు లభించలేదని, అంతేగాక, తాను నోరు విప్పాలని కూడా ఏ పార్టీ కోరుకోవడం లేదని చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications