వికీపీడియాలో ఇమ్రాన్ పెంపుడు శునకాలు: మరింత సమాచారం జోడించాల్సి ఉంది

కరాచి: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పెంపుడు శునకాలకు వికీపీడీయాలో చోటు దక్కిందట. ఈ మేరకు పాకిస్తాన్‌కు చెందిన పత్రిక ఒకటి ఈ కథనం ఇచ్చింది.

ప్రముఖ అంశాలపై సమాచారాన్ని క్రోఢీకరించి పాఠకులకు అందించే వికీపీడియాలో ఇమ్రాన్ పెంపుడు కుక్కలకు చోటు దక్కడం గమనార్హం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.

Imran Khans pet dogs get Wikipedia page, says Pakistani newspaper

దీంతో స్వతంత్రులు, చిన్న పార్టీలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం, ఆయన వ్యక్తిగత అంశాలపై నెటిజన్లు బాగా వెతుకుతున్నారు. దీంతో పెంపుడు కుక్కల కోసం ఓ వికీపీడియా పేజీని పొందుపర్చిన విషయాన్ని ఎన్‌సైక్లోపీడియా సహాయక బృందం ధ్రవీకరించింది.

ఇందులో పొందుపరచిన విషయాల్లో ఇమ్రాన్ ఖాన్‌కు అయిదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. పేర్లు మోతీ, షేర్ని, పిదూ, మ్యాక్సిమస్‌, షేరు. ఇందులో మ్యాక్సిమస్‌ ఆయనతో ఉందా లేక ఆయన రెండో భార్యతో ఉందోననే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. మరింత సమాచారం జోడిస్తామని ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రముఖ దేశాల అధ్యక్షుల పెంపుడు జంతువుల సమాచారం వికీపీడియాలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+