మరో బాంబు పేల్చిన ట్రంప్ సర్కార్: అలాంటి వారికి గ్రీన్ కార్డు రద్దు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. అమెరికాకు కొన్నేళ్ల కిందట వచ్చి స్థిరపడిన వలసదారులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు నిరాకరించింది. అమెరికాలో స్థిరపడిన ఆదేశ ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారికి గ్రీన్‌కార్డు ఇచ్చేది లేదంటూ తాజా ఆదేశాలు ట్రంప్ సర్కార్ జారీ చేసింది. ముఖ్యంగా ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన ఫుడ్ స్టాంప్స్, వైద్యసేవలు, ఇతర ప్రజాపంపిణీ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందే వలసదారులకు గ్రీన్ కార్డు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది. ఇక ట్రంప్ సర్కార్ నిర్ణయంతో కొన్ని లక్షల మంది వలసదారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం ఎక్కువగా హిస్పానిక్ వలసదారులపై పడనుంది. వారు చాలా తక్కువ వేతనంకు పనిచేస్తూ అమెరికా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.
అమెరికాలో చట్టబద్ధంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తూ ప్రస్తుతం దేశం వెలుపల ఉన్న పేద మరియు తక్కువ నైపుణ్యం గల వలసదారుల ఆశలపై ట్రంప్ సర్కార్ నిర్ణయంతోనీళ్లు చల్లినట్లయ్యింది. ఒకవేళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోరుతూ అమెరికా దేశంలో నివాసం ఉండాలంటే అది చెల్లదని అలాంటి వారిని అమెరికాలో ఉండనిచ్చేది లేదని కొత్త నిర్వచనం ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. ఇక ఇప్పటికే గ్రీన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటున్న వారిని గుర్తించి వారి గ్రీన్ కార్డు రద్దు చేస్తామని పేర్కొంది.

నిజమైన అమెరికా పౌరులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే.. అమెరికాలో స్థిరపడే వలసదారులు ఆర్థికంగా నిలదొక్కుకుని ఉండాలని ట్రంప్ చెప్పినట్లుగా వైట్‌హౌజ్ ప్రకటన విడుదల చేసింది. ఇక చాలామంది వలసదారులు ఇప్పటికే తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలితాలతో లబ్దిపొందారని ఇదిలానే కొనసాగితే అమెరికా పౌరులు అన్యాయానికి గురవుతారని వెల్లడించింది. ఇక తాజా ఆదేశాలు 22 మిలియన్ వలసదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక సగానికి పైగా వలసదారుల్లో ప్రతి కుటుంబం నుంచి ఒకరు ప్రభుత్వం అందించే వైద్యసేవలు వినియోగించుకుంటున్నారని వైట్ హౌజ్ పేర్కొంది. 78శాతం గృహాల్లో ఉంటున్న వలసదారులు కనీసం హైస్కూల్ విద్యను కూడా అభ్యసించకుండానే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని అధికారులు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications