టారిఫ్ గొడవల మధ్య- అమెరికాలో నివసించే భారతీయుల కోసం కొత్తగా..
అమెరికాలో భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ తన దౌత్య సేవలను మరింత విస్తరించింది. ఈ క్రమంలో- అమెరికా వ్యాప్తంగా కొత్తగా ఎనిమిది ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన అమెరికాలో భారత రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. నేటి నుండి ఈ కొత్త కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

బోస్టన్, కొలంబస్, డల్లాస్, డెట్రాయిట్, ఆడైసన్, ఒర్లాండో, రాలీ, శాన్ హోసే నగరాలలో ఈ కొత్త భారతీయ కాన్సులర్ అప్లికేషన్ కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటు ద్వారా భారతీయ డయాస్పోరాకు కాన్సులర్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, సేవలు సులభతరం, వేగవంతమౌతాయని వినయ్ క్వాట్రా పేర్కొన్నారు.
త్వరలోనే లాస్ ఏంజెల్స్‌లో మరో కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో- అమెరికా వ్యాప్తంగా నివసించే లక్షలాది మంది భారతీయులకు కాన్సులర్ సేవలు మరింత చేరువ చేసినట్టవుతుందని అన్నారు. అప్లికేషన్లు మరింత ప్రాసెస్ అవుతాయని చెప్పారు.
శనివారాల్లో కూడా ఈ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ల కార్యకలాపాలు కొనసాగుతాయని క్వాట్రా తెలిపారు. బోస్టన్, లాస్ ఏంజిల్స్‌లలో కొత్త కాన్సులేట్లను తెరవడం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని.. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ డయాస్పోరా సభ్యులు భారత ఎంబసీ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని రాయబారి క్వాత్రా కోరారు. ఈ కొత్త కాన్సులర్ అప్లికేషన్ కేంద్రాల ప్రారంభం, వివిధ కాన్సులర్ సేవల లభ్యతకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఆ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఆయన సూచించారు.
Announcing major expansion of our Consular Services in USA beginning August 01, 2025. Here is a message from Ambassador Vinay Kwatra about this expansion and the positive changes it would bring to our service delivery. pic.twitter.com/w35fakWDTo
— India in USA (@IndianEmbassyUS) July 31, 2025
విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, అమెరికాలో సుమారు 5.4 మిలియన్ల భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో 2.07 మిలియన్ల నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) ఉన్నారు. భారతీయ డయాస్పోరా, భారత్-అమెరికా సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.












Click it and Unblock the Notifications