భారత్ కు ట్రంప్ భారీ ఊరట..! ఆంక్షలు 6 నెలలు వాయిదా..!

రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దం కొనసాగేందుకు కారణమవుతున్నారన్న సాకుతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటిని తగ్గించే విషయంలో త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరుగుతున్న వరుస చర్చల్లో ఈ మేరకు పురోగతి లభించినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ డీల్ కు ముందే భారత్ కు ట్రంప్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.

ఇరాన్ లో భారత్ వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న చబహార్ పోర్టుపై తాజాగా ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో ఈ పోర్టు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న భారత్, ఇరాన్ ఇరుకునపడ్డాయి. ఇజ్రాయెల్ తో యుద్దం సమయంలో పంతం ప్రదర్శించిన ఇరాన్ ను టార్గెట్ చేసేలా ఈ ఆంక్షలు విధించారు. అయితే భారత్ తో వాణిజ్య చర్చలు కొనసాగుతుండటం, త్వరలో వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉండటంతో ట్రంప్ ఇప్పుడు ఈ ఆంక్షల్ని ఆరు నెలల పాటు వాయిదా వేశారు.

India Gets 6-Month US Sanctions Exemption for Iran s Chabahar Port Boosting Trade and Connectivity

ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఈ విషయాన్ని ఇవాళ నిర్ధారించింది. ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు అమెరికా విధించిన ఆంక్షలు వర్తించబోవని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నిరంతర చర్చలు జరుగుతున్నాయని నిర్ధారించింది. ఇరుదేశాలు చురుగ్గా చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు వాణిజ్య శాఖ వెల్లడిస్తుందని విదేశాంగశాఖ తెలిపింది.

India Gets 6-Month US Sanctions Exemption for Iran s Chabahar Port Boosting Trade and Connectivity

మరోవైపు భారత్ కు చమురు సరఫరా చేస్తున్న రష్యా ఆయిల్ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షల్ని కూడా పరిశీలిస్తున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. దీని ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకున్న పరిస్ధితుల ఆధారంగా తాము నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. ఇంధన వనరుల విషయంలో తమ వైఖరి అందరికీ తెలిసిందేనని వెల్లడించింది. ఈ ప్రయత్నంలో తమ 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతా అవసరాలను తీర్చడానికి విభిన్న వనరుల నుండి చౌకగా చమురు పొందాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+